Malaysia Flight | చెన్నైలో మలేషియా విమానం అత్యవసర ల్యాడింగ్.. 186 మంది సురక్షితం..!
Malaysia Flight : మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఒకటి చెన్నై(Chennai)లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. అందులో ప్రయాణిస్తున్న 186 మంది, చైన్నై విమానాశ్రయ సిబ్బంది హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.
Malaysia Flight : మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఒకటి చెన్నై(Chennai)లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఇంధనంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అప్రమత్తమైన పైలట్లు వెంటనే చెన్నై విమానాశ్రయాన్ని సంప్రదించి.. అనుమతి లభించగానే సురక్షింతంగా ల్యాండ్ చేశారు. అదృష్టవశాతూ విమానం ఎలాంటి ప్రమాదానికి గురవ్వలేదు. దాంతో.. అందులో ప్రయాణిస్తున్న 186 మంది, చైన్నై విమానాశ్రయ సిబ్బంది హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.
మలేషియా విమానయాన సంస్థకు చెందిన విమానం సోమవారం అత్యవసరంగా చెన్నైలో ల్యాండ్ అయింది. 186 మంది ప్రయాణికులతో కౌలాలంపూర్ నుంచి చెన్నైకి బయల్దేరిన ఎంహెచ్156 గాల్లో ఉండగానే ఇంజిన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. రెండో ఇంజిన్‌లో సమస్య ఏర్పడడంతో పైలట్లు వెంటనే చెన్నై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను అప్రమత్తం చేశారు. సురక్షితంగా ల్యాండింగ్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దాంతో, చెన్నై విమానాశ్రయ అధికారులు హుటాహుటిన ఎమర్జెన్సీ సర్వీసులైన.. అంబులెన్స్, ఫైరింజన్లు, సీఐఎస్ఎఫ్ బృందాలను పిలిపించారు.
News Alert! Malaysia Airlines’ MH156 diverted to Chennai due to issue involving Engine No 2; 186 passengers onboard, says official. pic.twitter.com/xbemMaRdvn
— Press Trust of India (@PTI_News) September 7, 2026
అయితే.. పైలట్లు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం 186 మంది ప్రయాణికులను, వారి లగేజీని దింపేశారు. ఇంధనంలో లోపం తలెత్తడానికి కారణాలను తెలుసుకునేందుకు ఢిల్లీ, చెన్నై విమానయాన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వారంలోనే ఇండిగో విమానాన్ని కూడా ఇలా అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. సెప్టెంబర్ 1వ తేదీన గోవా నుంచి ఢిల్లీకి బయల్దేరిన 6ఈ 2102 విమానం గాల్లో ఉండగానే ఇంధనంలో సమస్య ఏర్పడింది. ఫ్లయిట్ గాల్లోకి ఎగిరిన పదిహేను నిమిషాల్లోనే ఈ సమస్య తలెత్తడంతో పైలట్లు.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను సంప్రదించి సురక్షితంగా ల్యాండ్ చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

