Earthquake | ఉత్తర జపాన్(Japan)లోని హొక్కయిడో(Hokkaido)లో శనివారం భారీ భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని యూఎస్ జియోలాజికల్ సర్వే, జపాన్ వాతావరణ సంస్థ తెలిపాయి. తీరప్రాంత నగరాలైన కుషిరో, నెమురోలను భూకంపం వణించినా.. ఎలాంటి సునామీ (tsunami) హెచ్చరికలు జారీ చేయలేదని అధికారులు తెలిపారు.
అయితే, భూకంపం కారణంగా నష్టం జరిగినట్లు ఎలాంటి నివేదికలు అందలేదని పేర్కొన్నారు. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10.27 గంటలకు భూకంపం సంభవించిందని, ఉత్తర జపాన్‌కు 43 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. స్థానిక నిపుణులు మాట్లాడుతూ వారం పాటు భూకంపాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదిలా ఉండగా.. జపాన్‌లో భూకంపాలు సర్వసాధారణం. ఇది పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’లో ఉంది. ఆగ్నేయాసియా గుండా పసిఫిక్ బేసిన్ అంతటా విస్తరించి ఉన్న తీవ్రమైన భూకంప కార్యకలాపాల ఆర్క్. ఈ క్రమంలో భవనాలు బలమైన భూకంపాలను తట్టుకునేలా జపాన్ కఠినమైన నిర్మాణ నిబంధనలను తీసుకువచ్చింది. ఇదిలా ఉండగా.. ఇటీవల టర్కీలో భారీ భూకంపాల కారణంగా దాదాపు 50వేల మందికిపైగా మూసివేసిన విషయం తెలిసిందే.