ఒక్కో దేశంలో ఒక్కో రకమైన ఫుడ్ ఉంటుంది. మనకు కాంటినెంటల్ ఫుడ్ అంటే ఇష్టం ఉంటుంది. అలాగే.. విదేశీయులు కూడా ఇండియన్ ఫుడ్‌ను ఇష్టపడతారు. అలా.. మాడ్రిడ్‌కు చెందిన ఓ యువతి ఫస్ట్ టైమ్ ఇండియన్ ఫుడ్ ట్రై చేసింది. తొలిసారి ఇండియన్ ఫుడ్‌ను టేస్ట్ చేసిన తర్వాత ఆ యువతి రియాక్షన్ ఏంటో చూస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే.
ఫాతిమా డె తెటువాన్ అనే 20 ఏళ్ల యువతి మాడ్రిడ్‌లోని ఉదయ్‌పూర్ అనే ఇండియన్ రెస్టారెంట్లో నాన్‌తో చికెన్ టిక్కా మసాలాను టేస్ట్ చేసింది. వావ్.. ఇండియన్ ఫుడ్ ఇంత బాగుంటుందా. ఈ విషయం తెలియక 20 ఏళ్ల నుంచి టేస్టీ ఫుడ్‌ను మిస్ అయ్యాను. ఇక నుంచి ఇండియన్ ఫుడ్‌ను అస్సలు వదలను.. అంటూ వీడియోలో ఫాతిమా చెబుతుంది. మొత్తానికి తన రియాక్షన్‌ను చూసి నెటిజన్లు మాత్రం ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.