కీవ్: ఉక్రెయిన్లోని పశ్చిమ నగరం లివివ్లో ఇవాళ భారీ పేలుళ్లు జరిగాయి. మూడు ప్రదేశాల్లో పేలుళ్లు నమోదు అయినట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున 6.30 నిమిషాలకు భారీ శబ్ధాలు వినిపించాయి. దానికి ముందు నగరంలో ఎయిర్ రైడ్ సైరన్లు మోగాయి. లివివ్ నగరంలో ఉన్న ఎయిర్పోర్ట్ను కూడా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. దాడులతో దద్దరిల్లిన లివివ్ నగరం అంతా నల్లటి పొగతో కమ్ముకున్నది. మూడు వారాలు దాటిన యుద్ధంలో.. ఇప్పటి వరకు రష్యా పశ్చిమ ఉక్రెయిన్ ప్రాంతాలను ఎక్కువగా టార్గెట్ చేయలేదు. అయితే గడిచిన ఆదివారం మాత్రం.. పోలాండ్ బోర్డర్ వద్ద ఓ సిటీపై చేసిన అటాక్లో 35 మంది చనిపోయిన విషయం తెలిసిందే.