న్యూఢిల్లీ: స్పెయిన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ మాజీ చీఫ్ లూయిస్ రూబియేల్స్ను ముద్దు వివాదం ముప్పు తిప్పలు పెడుతోంది. ఫుట్‌బాల్‌కు సంబంధించిన ఎలాంటి కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఫిఫా క్రమశిక్షణా కమిటీ లూయిస్ రూబియేల్స్పై మూడేళ్ల నిషేధం విధించింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దాంతో వచ్చే మూడేళ్లు ఆయన ఫుట్‌బాల్‌కు సంబంధించి ఎలాంటి కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది.
మహిళల ఫిఫా వరల్డ్ కప్-2023 టోర్నీలో స్పెయిన్ టీమ్ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వేదికపైనే స్పెయిన్ ఫుట్‌బాల్ క్రీడాకారిణి జెన్నీ హెర్మోసోను లూయిస్ రూబియేల్స్ ముద్దు పెట్టుకున్నాడు. ఆమెకు లిప్ టు లిప్ కిస్ ఇవ్వడంతో వేదికపై ఉన్న అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఘటనను ప్రపంచ సాకర్ బాడీ సీరియస్‌గా తీసుకుంది. లూయిస్ రూబియేల్స్పై క్రమశిక్షణా చర్యలు చేపట్టింది.
దాంతో ఈ ఏడాది సెప్టెంబర్‌లో లూయిస్ రూబియేల్స్ స్పెయిన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఫుట్ బాల్‌కు సంబంధించిన ఎలాంటి కార్యకలాపాల్లో రూబియేల్స్ పాల్గొనకుండా ప్రపంచ సాకర్ బాడీ మూడు నెలల నిషేధం విధించింది. కాగా, రూబియేల్స్పై నిషేధం విధించిన అంశంపై స్పందించేందుకు ఆయన న్యాయవాది నిరాకరించారు.