లాహోర్: పాకిస్థాన్‌లోని ప్రధాన పట్టణాల్లో ఒకటైన లాహోర్ (Lahore) భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. గురువారం ఉదయం లాహోర్‌లోని వాల్టన్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఉన్న గోపాల్ నగర్, నసీరాబాద్ ప్రాంతాల్లో వరుస పేలుళ్లు సంభవించాయని, దట్టమైన పొగలు కమ్ముకున్నదని స్థానిక మీడియా వెల్లడించింది. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి వీధుల్లోకి పరుగులు పెట్టారు. బుధవారం తెల్లవారుజామున ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ చేపట్టిన మిస్సైల్ దాడుల అనంతరం ఈ పేలుళ్లు సంభవించడం గమనార్హం.
అయితే డ్రోన్ల వల్ల పేలుళ్లు జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అవి 5 నుంచి 6 ఫీట్ల పొడవు ఉండవచ్చని అనుమానిస్తున్నారు. వ్యవస్థలను స్తంభింపజేయడమే లక్ష్యంగా ఈ డ్రోన్ దాడి జరిగిఉండవచ్చని అనుమనిస్తున్నారు. పేలుళ్లు సంభవించిన ప్రాంతాలకు సమీపంలోనే లాహోర్ ఆర్మీ కంటోన్మెంట్ ఉన్నది. భారీ పేలుళ్ల నేపథ్యంలో సియాల్కోట్, లాహోర్ ఎయిర్‌పోర్టుల్లో విమానా రాకపోకలను నిలిపివేశారని, రెండు విమానాశ్రయాలను మూసివేశారని మీడియా పేర్కొంది. కాగా, పేలుళ్ల వల్ల జరిగిన నష్టానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదని పోలీసు వర్గాలు వెళ్లడించాయి.
Utter chaos in Lahore after drone strike at Walton Road which leads to Lahore cantonment. People out on streets in panic. Asim Munir’s Jihadist policies have invited war to Pakistan’s streets. pic.twitter.com/1195BQxlhf
— Divya Kumar Soti (@DivyaSoti) May 8, 2025