చైనా జూలో ఓ సింహం డిఫరెంట్ హెయిర్ కట్‌తో ఆకట్టుకుంటున్నది. సరికొత్త హెయిర్‌స్టైల్‌లో మృగరాజు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ సింహానికి హెయిర్ కట్ ఎవరు చేశారు? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తుండగా, తాము అంత సాహసం చేస్తామా? అని జూ నిర్వాహకులు అంటున్నారు.
చైనాలోని గాంగ్జ్యూ జూలో వెరైటీ హెయిర్‌కట్‌తో ఓ సింహం తిరుగుతుండగా ఓ సందర్శకుడు దాన్ని కెమెరాలో బంధించాడు. అనంతరం చైనా సోషల్‌మీడియాలో షేర్ చేయగా, వైరల్ అవుతోంది. ‘ఈ సింహానికి ఎవరు హెయిర్ కట్ చేశారు..వెరైటీ లుక్‌లో సింహాన్ని చూసి నవ్వాపుకోలేకపోయాను’ అని అతడు క్యాప్షన్ ఇచ్చాడు. కాగా, సింహానికి తాము కటింగ్ చేసేంత సాహసం చేయమని జూ అధికారులు చెప్పారు. అధిక తేమ వల్ల దాని జుట్టు ఊడిపోయి అలా తయారైందని వెల్లడించారు. ‘నేను నా హెయిర్‌స్టైల్‌ను మార్చుకున్నా చాలా అందంగా కనిపిస్తున్నాను.. రండి.. జూకు వచ్చి నన్ను చూడండి’ అంటూ ఆ సింహం పేరుతో జూ అధికారులు యాడ్ కూడా ఇచ్చారు.