Life On Mars | ఈ విశ్వంలో మనం ఒంటరి కాదని.. ఎక్కడో ఒక చోట జీవిరాశి ఉండే ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ క్రమంలో సౌర మండలంలో ఉన్న గ్రహాలతో పాటు సుదూర విశ్వంలో జీవరాశి కోసం అన్వేషిస్తున్నారు. మన భూమికి దగ్గరలో ఉన్న గ్రహాల్లో అంగారక గ్రహం ఒకటి. ఈ గ్రహంపై శాస్త్రవేత్తలను ఆకర్షిస్తున్నది. ఈ గ్రహంపై జీవం ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థతో పాటు పలు దేశాలకు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థలు అనేక ఉపగ్రహాలను పంపాయి. అంగారక గ్రహంలోని మంచు భాగాల్లో గ్రహాంతర జీవులు ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. మంచు పలకల కింద జీవం ఉండాల్సిందేనని పేర్కొంటున్నారు. అక్కడ పొడి మంచు కింద కిరణజన్య సంయోగక్రియ వంటి ప్రక్రియ జరుగుతూ ఉండాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. తాజాగా మరో కొత్త అధ్యయనం వెలుగులోకి వచ్చింది. కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియలో, మొక్కలు, ఆల్గే, సైనోబాక్టీరియా రసాయన శక్తిని ఉత్పత్తి చేస్తాయని అధ్యయనం పేర్కొంటుంది.
అయితే, నీరు, సూర్యరశ్మి దీనికి అవసరమవుతాయి. భూమి వాతావరణంలోని ఆక్సిజన్‌లో ఎక్కువ భాగం ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతుంది. ఒక కొత్త అధ్యయనం ప్రకారం, అంగారకుడిపై ధ్రువాల దగ్గర మందపాటి మంచుపొర ఉన్నది. దా కింద జీవం ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సూర్యుడి రేడియేషన్ నుంచి తప్పించుకోవడానికి కిరణజన్య సంయోగక్రియ.. లేదంటే ఇదే విధమైన ప్రక్రియ ద్వారా మంచు పలకల కింద జీవం వృద్ధి చెందిందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీన్నే రేడియేటివ్ హాబిటబుల్ జోన్స్ అంటారు. కిరణజన్య సంయోగక్రియకు సరైన మొత్తంలో కాంతి అవసరం. మార్స్‌పై ఇదే జీవం ఉందని చెప్పడం లేదని పేర్కొంటున్నారు. నాసా మార్స్ ఆర్బిటర్, రోవర్, ఎక్సోమార్స్ తదితర అంతరిక్ష నౌకలు తీసుకువచ్చిన డేటాను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. అయితే, అంగారక గ్రహంపైకి వెళ్లి మంచు కింద పరిశోధిస్తేనే వాస్తవం తెలియనున్నది.
నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ పరిశోధకుడు ఆదిత్య ఖుల్లార్ మాట్లాడుతూ.. అంగారక గ్రహంపై జీవం కనుగొన్నట్లు తాము చెప్పడం లేదని.. అయితే మార్స్ దుమ్ముతో కూడిన పొడి మంచు పలకల కింద జీవం ఉండే అవకాశం ఉందని మాత్రం నమ్ముతున్నామన్నారు. ఇది భవిష్యత్తులో అధ్యయనం చేయవచ్చన్నారు. భూమి, మార్స్ నియోవసయోగ్యమైన జోన్లోకి వస్తాయన్నారు. రెండూ సూర్యుడికి చాలాదూరంలో ఉన్నాయని.. ఇక్కడ జీవం అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉందన్నారు. దీనికి భూమే నిదర్శనమన్నారు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటుందని.. భూమిపై ఉన్నట్లుగా నీరు కూడా ఉంటుందన్నారు. మార్స్ పొడిగా ఉంటుంది.. దానిలో చాలాభాగం వరకు ఎరుపురంగులో పొడిగా ఉంటుందన్నారు. అంగారక గ్రహాన్ని సందర్శించిన చాలా అంతరిక్ష నౌకలు ఎండిపోయిన నదీ పరీవాహక ప్రాంతాలు, సరస్సులు, నదుల శాఖలను రికార్డు చేశాయి.
లక్షల సంవత్సరాల కింద ఎర్ర గ్రహంపై నీరు ఉండే అవకాశం ఉంది. మార్స్ రికనైసెన్స్ ఆర్బిటర్ కూడా దీన్ని ధ్రువీకరించింది. మార్స్ మీద అతినీలలోహిత వికిరణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జీవానికి ప్రమాదకరంగా మారుతుంది. భూమి తరహాలో మార్స్ మీద ఓజోన్ తరహాలో రక్షణ కవచం లేదని ఆదిత్య ఖుల్లార్ చెప్పారు. దాంతో అక్కడ 30శాతం ఎక్కువ రేడియేషన్ ఉంటుంది. డేటా విశ్లేషణలో అంగారక గ్రహంపై 2 నుంచి 15 అంగుళాల మంచు పలకలు ఉన్నాయని తేలింది. అదంతా కలుషితమైందని.. అందులో 0.1శాతం దుమ్ము కూడా ఉన్నట్లు గుర్తించారు. కాలుష్యంతో కొన్ని చోట్ల మంచు పొర మందం 7 నుంచి 10 అడుగుల వరకు ఉంటుంది. ఈ క్రమంలో పరిస్థితిలో దాని కింద జీవం అభివృద్ధి చెందే అవకాశం పెరుగుతుందని.. ఎందుకంటే సూర్య కిరణాల ప్రభావం తగ్గుతుందని వివరించారు.