లండన్, ఏప్రిల్ 22: టైటానిక్ ఓడ ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడిన లైఫ్ జాకెట్.. వేలం పాటలో రికార్డులను బద్దలు కొట్టింది. రికార్డ్ స్థాయిలో 6,70,000 డాలర్లకు (రూ.8.39 కోట్లు) అమ్ముడుపోయింది. ఓడలో ఫస్ట్-క్లాస్ ప్రయాణికురాలు లారా మేబెల్ ఫ్రాంకాటెల్లీ ఈ లైఫ్ జాకెట్‌ను ధరించి తన ప్రాణాలను రక్షించుకుంది.
లైఫ్ బోట్లోకి ఎక్కి ప్రమాదం నుంచి బయటపడింది. ఈ లైఫ్ జాకెట్‌పై ఆమెతోపాటు, ప్రాణాలతో బయటపడిన తోటివారి సంతకాలు కూడా ఉన్నాయి. ఇంగ్లండ్‌లోని డెవిజెస్లో హెన్రీ ఆల్డ్రిడ్జ్ అండ్స సన్ నిర్వహించిన టైటానిక్ జ్ఞాపికల వేలంలో లైఫ్ జాకెట్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక బిడ్డర్ దీనిని ఫోన్ కాల్ ద్వారా కొనుగోలు చేశారు. ఇదే వేలం పాటలో, లైఫ్ బోట్ సీటు కుషన్‌ను టెన్నెసీ, మిస్సోరీలోని టైటానిక్ మ్యూజియం యజమానులు 3,90,000 డాలర్లకు కొనుగోలు చేశారు.