జొహెనెస్బర్గ్: ఆఫ్రికాలో ఆయుర్దాయం సగటున ప్రతి మనిషిలో 10 ఏండ్లు పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ పెరుగుదల 2000-2019 మధ్య నమోదైందని వెల్లడించింది.
ఈ కాలంలో ఈ స్థాయిలో పెరుగుదల కేవలం ఆఫ్రికా రీజియన్లోనే నమోదైందని పేర్కొంది. 2000 లో సగటున ఓ వ్యక్తి 46 ఏండ్లు జీవిస్తే 2019నాటికి 56 ఏండ్లకు ఆయుర్దాయం పెరిగిందని తెలిపింది. అయితే ప్రపంచవ్యాప్తంగా సగటు ఆయురార్దం 64 ఏండ్లు కాగా.. ఇప్పటికీ ఆఫ్రికా రీజియన్లో సగటు ఆయుర్దాయం 56 ఏండ్లే ఉన్నదని వివరించింది.