Licypriya Kangujam | కాప్-28 సమావేశాల్లో కలకలం.. వేదికపైకి దూసుకొచ్చి మణిపూర్ బాలిక నిరసన.. Viral video
Licypriya Kangujam | భూగోళంపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని నియంత్రించడమే లక్ష్యంగా దుబాయ్‌లో జరుగుతున్న కాప్-28 సమావేశాల్లో ఇవాళ (మంగళవారం) కలకలం చెలరేగింది. మణిపూర్‌కు చెందిన లిసిప్రియా కాంగుజమ్ అనే 12 ఏళ్ల బాలిక అకస్మాత్తుగా చర్చా వేదికపైకి వచ్చి పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల వాడకానికి వ్యతిరేకంగా నినాదాలు చేసింది. అంతేగాక శిలాజ ఇంధనాలకు వ్యతిరేకంగా వేదికపై ప్లకార్డును ప్రదర్శించింది.
దుబాయ్: భూగోళంపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని నియంత్రించడమే లక్ష్యంగా దుబాయ్‌లో జరుగుతున్న కాప్-28 సమావేశాల్లో ఇవాళ (మంగళవారం) కలకలం చెలరేగింది. మణిపూర్‌కు చెందిన లిసిప్రియా కాంగుజమ్ అనే 12 ఏళ్ల బాలిక అకస్మాత్తుగా చర్చా వేదికపైకి వచ్చి పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల వాడకానికి వ్యతిరేకంగా నినాదాలు చేసింది. అంతేగాక శిలాజ ఇంధనాలకు వ్యతిరేకంగా వేదికపై ప్లకార్డును ప్రదర్శించింది.
ఇదిలావుంటే.. శిలాజ ఇంధనాల విచ్చలవిడి వాడకం కారణంగా భూమి సగటు ఉష్ణోగ్రతలు అంతకంతకే పెరిగిపోతున్నాయి. అంతేకాదు, ఈ పరిణామం ఫలితంగా భవిష్యత్తులో అనూహ్యమైన వాతావరణ మార్పులు చోటుచేసుకుంటాయని, సముద్ర మట్టాలు పెరిగిపోయి తీర ప్రాంతాల్లోని ముంబై వంటి నగరాలు మునిగిపోతాయని శాస్త్రవేత్తలు చాలాకాలం నుంచి హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో లిసిప్రియ శిలాజ ఇంధనాలపై తన వ్యతిరేకతను స్పష్టంచేస్తూ నినాదాలు చేయడంతో కొంత సమయం అక్కడ గందరగోళం నెలకొంది.
ఒక్కసారిగా వేదికపైకి దూసుకొచ్చిన లిసిప్రియ.. ప్రభుత్వాలన్నీ కలిసికట్టుగా శిలాజ ఇంధనాల వాడకాన్ని వెంటనే తగ్గించాలని నినదించింది. చర్చలకు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న వ్యక్తి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆమె వినలేదు. తాను చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా అందరికీ వివరించింది. ఇంతలో ఇద్దరు భద్రతాసిబ్బంది లిసిప్రియను వేదిక పైనుంచి పక్కకు తీసుకెళ్లారు. అయితే సమావేశంలో ఉన్న వివిధ దేశాల సభ్యులు మాత్రం లిసిప్రియ చర్యను సమర్థిస్తూ చప్పట్లతో అభినందించారు. ఈ కాలపు యువత ఆశయాలకు లిసిప్రియ నిదర్శనమని కొనియాడారు.
నిరసన అనంతరం లిసిప్రియ ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసింది . ‘నేను నిరసన తెలియజేసినందుకు వారు నన్ను 30 నిమిషాల పాటు అదుపులోకి తీసుకున్నారు. శిలాజ ఇంధనాలు వాడొద్దని చెప్పడమే నేను చేసిన నేరం. మీరు నిజంగా శిలాజ ఇంధనాలను వ్యతిరేకిస్తే నాకు మద్దతివ్వండి. నిబంధలకు విరుద్ధంగా ఐక్యరాజ్యసమితి ప్రాంగణంలోనే బాలల హక్కుల ఉల్లంఘన జరిగింది’ అంటూ ఐరాస సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌ను ట్విట్టర్లో ట్యాగ్ చేసింది.
Here is the full video of my protest today disrupting the UN High Level Plenary Session of #COP28UAE. They detained me for over 30 minutes after this protest. My only crime- Asking to Phase Out Fossil Fuels, the top cause of climate crisis today. Now they kicked me out of COP28. pic.twitter.com/ToPIJ3K9zM
— Licypriya Kangujam (@LicypriyaK) December 11, 2023
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

