న్యూయార్క్: గాంధీ జయంతి సందర్భంగా ఐక్యరాజ్యసమితి నివాళి అర్పించింది. గాంధీ చూపిన శాంతి మార్గంలో పయనిద్దామని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ తెలిపారు. తన ట్విట్టర్లో ఆయన స్పందించారు. ద్వేషం, విభజన, యుద్ధాలకు కాలం చెల్లిందని, ఇప్పుడు శాంతి, విశ్వాసం, సహనంతో కూడిన కొత్త యుగాన్ని నిర్మించాలన్నారు. గాంధీ పుట్టిన రోజును అంతర్జాతీయ అహింసా దినంగా జరుపుకుంటామని, ఈ నేపథ్యంలో గాంధీ వినిపించిన శాంతి సందేశాన్ని పాటిద్దామని, పటిష్టమైన భవిష్యత్తు కోసం కట్టుబడి ఉండాలని గుటెర్రెస్ తన ట్వీట్లో కోరారు.
Hatred, division and conflict have had their day.
— António Guterres (@antonioguterres) October 2, 2021
It is time to usher in a new era of peace, trust and tolerance.
On this International Day of Non-Violence – Gandhi's birthday – let's heed his message of peace, and commit to building a better future for all.