న్యూఢిల్లీ: మానసిక కుంగుబాటు లక్షణాల నుంచి తక్షణం ఉపశమనం పొందడానికి లాఫింగ్ గ్యాస్ (నైట్రస్ ఆక్సైడ్) ఉపయోగపడుతుంది. ఒక మోతాదు నైట్రస్ ఆక్సైడ్ వేసుకుంటే, ఈ లక్షణాలు 24 గంటల్లో తగ్గుతాయి.
బర్మింగ్‌హాం, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాల పరిశోధకుల అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ నివేదికను ఈ బయోమెడిసిన్‌లో ప్రచురించారు. బర్మింగ్‌హాం వర్సిటీకి చెందిన సైకియాట్రిస్ట్ స్టీవెన్ మర్వాహా.. నివేదికలో కీలక విషయాలు తెలిపారు.