మార్కార్డి: మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద కార్టూన్ వేసిన స్వీడెన్కు చెందిన కార్టూనిస్టు లార్స్ విల్క్స్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. సివిల్ పోలీసు వాహనంలో వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న వెహికిల్ ఓ ట్రక్కును ఢీకొట్టింది. దక్షిణ స్వీడన్‌లోని మార్కార్డిలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఓ కుక్క శరీరానికి ప్రవక్త బొమ్మను కార్టూన్లా గీసిన లార్స్ తీవ్ర విమర్శలకు గురయ్యారు. ఆ కార్టూన్‌ను 2007లో ప్రచురించారు. డానిష్ పత్రికలో ప్రవక్తపై కార్టూన్లు వేసిన ఏడాది తర్వాత ఈ కార్టూన్ వేశారు. ముస్లింల నుంచి బెదిరింపులు రావడంతో ఆయనకు పోలీసు భద్రత కల్పించారు. అయితే పోలీసు వాహనంలో వెళ్తున్న సమయంలో యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు ఆఫీసర్లు కూడా మృతిచెందారు. ప్రవక్తపై కార్టూన్ వేసిన లార్స్ను పట్టిస్తే లక్ష డాలర్లు ఇస్తామంటూ ఆల్‌ఖయిదా ప్రకటించింది.