ఇస్లామాబాద్: పాకిస్థాన్(Pakistan)లోని ఇస్లామాబాద్‌లో ఉన్న ఓ నకిలీ కాల్ సెంటర్‌పై ప్రభుత్వ అధికారులు రెయిడ్ చేశారు. అయితే ఆ తర్వాత అక్కడ తీవ్ర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రెయిడ్ తర్వాత.. స్థానికులు వచ్చి ఆ కాల్ సెంటర్లో ఉన్న ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, ఇతర పరికరాలను ఎత్తుకెళ్లారు. లూటీకి చెందిన వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతున్నది.
ఇస్లామాబాద్‌లోని సెక్టార్ ఎఫ్-11లో ఉన్న కాల్ సెంటర్ హబ్‌పై ఎఫ్ఐఏ అధికారులు రెయిడ్ చేశారు. అయితే ఆ కాల్ సెంటర్‌ను చైనీయులు ఆపరేట్ చేస్తున్నట్లు తేలింది. ఆ సెంటర్ నుంచి ఫ్రాడ్ జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. అక్రమంగా నడుపుతున్న ఆ కాల్ సెంటర్‌పై అధికారులు రెయిడ్ చేశారు. సెంటర్లో ఉన్న ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, మానిటర్లు, కీబోర్డులు, ఎక్స్‌టెన్సన్లు.. ఏదిపడితే అది లోకల్స్ ఎత్తుకెళ్లారు. ఫర్నీచర్, కట్లరీ సెట్లను కూడా లూటీ చేశారు.
లూటీపై ఎక్స్ అకౌంట్లో కొందరు వీడియోలు పోస్టు చేశారు. చైనా కాల్ సెంటర్లో పాకిస్తానీలు లూటీ చేసినట్లు ఓ వీడియోకు పోస్టు పెట్టారు. వందల సంఖ్యలో ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్ పరికాలు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయడం కన్నా.. పాకిస్థాన్‌లో బిజినెస్ చేయం రిస్క్ అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. కాల్ సెంటర్‌ను ఓ ఛారిటీ డ్రైవ్‌గా మార్చేసినట్లు మరో యూజర్ పేర్కొన్నాడు.
ఇస్లామాబాద్ కేంద్రంగా ఆ కాల్ సెంటర్ స్కామ్‌లు నడిపిస్తున్నట్లు తేలడంతో ఆ సెంటర్‌పై ఎఫ్ఐఏ అధికారులు తనిఖీ చేపట్టారు. చైనీయులు ఆ రాకెట్‌ను నడుపుతున్నట్లు గుర్తించారు. రెయిడ్ తర్వాత మొత్తం 24 మందిని అదుపులోకి తీసుకున్నారు. దీంట్లో విదేశీయులు కూడా ఉన్నారు. కొందరు పరారీ అయినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌లో లూటీ ఘటనలు జరగడం సాధారణమే. గత సెప్టెంబర్‌లో కరాచీలో ఓపెన్ చేసిన ఓ మాల్‌లోకి జనం ఎగబడి అక్కడ ఉన్న బట్టలు, ఇతర సామాగ్రిని ఎత్తుకెళ్లారు.
Pakistanis have Looted Call Centre operated by Chinese in Islamabad; Hundreds of Laptop, electronic components along with furniture and cutlery stolen during holy month of Ramadan pic.twitter.com/z6vjwBRRsq
— Megh Updates 🚨™ (@MeghUpdates) March 17, 2025