కేప్ కెనవెరల్: స్పేస్ఎక్స్ అంతరిక్ష నౌకలో విహరించేందుకు అమెరికాకు చెందిన కైల్ హిప్చెన్ సీటు సంపాదించాడు. కానీ ఆ సీటును ఫ్రెండ్‌కు ఇచ్చేశాడు. పది నిమిషాల పాటు టూరిస్టుగా రోదసిలోకి వెళ్లే ఛాన్సు దక్కినా.. ఆ అద్భుత క్షణాలకు ఓ అనివార్య కారణం వల్ల దూరం అయ్యాడు. గత ఏడాది స్పేస్ఎక్స్ సంస్థ కొందరు టూరిస్టులను అంతరిక్షంలోకి తీసుకువెళ్లిన విషయం తెలిసిందే. ఫ్లోరిడాకు చెందిన కైల్ హిప్చన్ కు కూడా ఆ టూర్‌కు ప్లానేశాడు. అతను అనుకున్నట్లు సీటు దక్కింది. కానీ స్పేస్ఎక్స్ విధించిన షరతుల వల్ల ఆ సీటును కోల్పోవాల్సి వచ్చింది. నియమం ప్రకారం ఉండవలసిన బరువు కన్నా.. ఎక్కువ ఉన్నందువల్ల కైల్ స్పేస్‌లోకి వెళ్లే అవకాశాన్ని కోల్పోయాడు. ఈ విషయాన్ని అతను ఇటీవల వెల్లడించాడు. అయితే ఒకప్పుడు తనతో రూమ్ షేర్ చేసుకున్న స్నేహితుడికే తన సీటును ఇచ్చేశాడు. వాషింగ్టన్లో డేటా ఇంజినీర్‌గా చేస్తున్న క్రిస్ సెంబ్రోస్కీకి ఆ లక్కీ ఛాన్స్ కొట్టేశాడు.
స్పేస్ టూర్‌కు సీటు దక్కినా .. ఎందుకు ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందో కైల్ క్లియర్‌గా చెప్పాడు. స్పేస్ఎక్స్ సంస్థ తన రూల్ ప్రకారం ఓ వ్యక్తి ఆరు అడుగుల ఎత్తు ఉండి..113 కిలోలు దాటవద్దు అని చెప్పింది. కానీ కైల్ ఎత్తులో సరిపోయినా.. బరువులో మాత్రం ఎక్కువే ఉన్నాడు. స్పేస్ ట్రిప్ కోసం పోటీపడుతున్న సమయంలో అతని బరువు 150 కిలోలు. ఆర్నెళ్ల సమయంలో అతను 113 కిలోలకు తగ్గాలి. అయితే ఆ టార్గెట్‌ను చేరుకునేందుకు కైల్ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కానీ బరువును తగ్గించడం అంత సులువు కాదు అనుకున్నాడు. అయితే స్పేస్ టూర్‌కు స్పాన్సర్ చేస్తున్న సంస్థ ఓ ఆఫర్ ఇచ్చింది. తనకు నచ్చిన వ్యక్తికి ఆ సీటును ఇవ్వవచ్చు అని తెలిపింది. అప్పుడు కైల్ తన పాత మిత్రుడు, ఏరో ఇంజినీర్ క్రిస్‌ను సూచించాడు. కైల్ చూపిన స్నేహానికి గుర్తుగా.. క్రిస్ ఓ మరిచిపోలేని పనిచేశాడు. కైల్కు చెందిన కొన్ని వస్తువుల్ని అంతరిక్షంలోకి క్రిస్ తీసుకువెళ్లాడు. స్నేహం కోసం స్పేస్ ట్రిప్ సీటును వదులుకున్న కైల్ ఔదర్యాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.