న్యూయార్క్: కీళ్ల నొప్పులకు వాడే మందులతో మధుమేహానికి చెక్‌పెట్టొచ్చని తాజా అధ్యయనంలో తేలింది. మధుమేహమే కాదు.. ఈ ఔషధంతో ఊబకాయుల్లో కొలెస్ట్రాల్ స్థాయులు తగ్గుతాయని యూఎస్‌లోని బేలర్ మెడిసిన్ కాలేజీ పరిశోధకులు తేల్చారు.
ఎలుకలపై ఔరానోఫిన్ ను ప్రయోగించి, మెటబాలిజాన్ని పరిశీలించారు. మెదడుకు సంకేతాలు చేరవేసే లెప్టిన్ హార్మోన్ స్థాయు ల్లో తగ్గుదల కనిపించిందని, తద్వారా ఊబకాయం తగ్గుతున్నట్టు గుర్తించారు. ఇన్సులిన్ నియంత్రణలోకి వచ్చినట్టు తేల్చారు. అధ్యయన వివరాలు ‘సెల్ మెటబాలిజం’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.