స్విట్జర్లాండ్: కిట్‌క్యాట్ చాక్లెట్లు తయారు చేసే నెస్లే సంస్థ మళ్లీ తన ఉత్పత్తుల ధరల్ని పెంచేసింది. అనూహ్య రీతిలో తయారీ ఖర్చులు పెరగడంతో ఆ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది. స్విట్లర్లాండ్‌కు చెందిన ఆ సంస్థ ఈ ఏడాది తొలి అర్థభాగంలోనే 6.5 శాతం ధరలను పెంచింది. మెక్‌డోనాల్డ్స్, కోకా కోలా లాంటి కంపెనీలు కూడా ఈ వారంలో తమ ఉత్పత్తుల ధరలను పెంచాయి. ఇంధన ధర పెరగడం, జీతాలు, తయారీ వస్తువుల ధరలు పెరగడంతో కంపెనీలపై భారం పడుతోంది. ఇక బ్రిటన్‌లో గత 40 ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో వినియోగ వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బాధ్యతాయుతమైన రీతిలోనే ధరలను పెంచుతున్నామని నెస్లే చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ షిండర్ తెలిపారు. యూరోప్‌తో పోలిస్తే అమెరికాలో తమ ఉత్పత్తుల ధరలు అధికంగా పెరిగినట్లు ఆయన చెప్పారు.