హైదరాబాద్ : పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్‌లోని(Iran) పలు సైనిక స్థావరాలే లక్ష్యంగా 80 యుద్ధ విమానాలు, 230 బాంబులతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. దీనికి దీటుగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ ప్రతిదాడులు జరిపింది. దీంతో పశ్చిమాసియా అగ్ని గుండాన్ని తలపిస్తున్నది. కాగా, ఇరాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించగా, ఆయన కుమారుడు ముజ్తబా హొస్సేనీ ఖమేనీకి(,Mojtaba Hosseini Khamene) గాయాలైనట్లు ఇజ్రాయెల్ మీడియా వర్గాలు, భద్రతా అధికారులు వెల్లడించారు.
ఖమేనీని లక్ష్యంగా చేసుకున్న దాడిలో ఆయన మృతి చెందారని, ఈ క్రమంలో ముజ్తబా గాయపడి బతికిపోయారని నివేదికలు చెబుతున్నాయి. అయితే ఫిబ్రవరి 28న దాడి జరిగన సమయంలో తన తండ్రితో పాటే ఉన్నాడా అనే విషయంలో స్పష్టత రావడంలేదు. ఖమేనీ స్థానాన్ని భర్తీ చేస్తాడని భావిస్తున్న తరుణంలో ముజ్తబా గాపడ్డారనే వార్తలు ఇరాన్‌ను మరింత ఇబ్బంది పెట్టే విషయమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ముజ్తబాకు అధికారం కట్టబెట్టేందకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ససేమీరా అంగీకరించడంలేదు.