టోరంటో: కెనడాలోని బ్రిటీష్ కొలింబియాలో ఉన్న ఓ గురుద్వారాలో సిక్కు ఫర్ జస్టిస్ గ్రూపు ఆదివారం ఖలిస్థానీ రెఫరెండం కార్యక్రమం నిర్వహించింది. సర్రేలోని గురునానక్ సిక్కు గురుద్వారాలో ఈ మేరకు ఓటింగ్ చేపట్టింది. కెనడాలో ఖలిస్థానీ తీవ్రవాద సంస్థలు చేపడుతున్న భారత వ్యతిరేక కార్యకలాపాలపై ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రుడోతో జరిగిన సమావేశంలో భారత ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేసిన రోజునే ఈ పరిణామం చోటుచేసుకుంది.