సియోల్ : పాప్ సింగర్ హెసూ (29) విషాదాంతంతో ఆమె అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు . అనతికాలంలోనే ప్రముఖ కొరియన్ పాప్ సింగర్‌గా ఎదిగిన హెసూ హోటల్ రూంలో విగతజీవిగా కనిపించారు. ట్రాట్ (కొరియన్ మ్యూజిక్‌లో ప్రముఖ విభాగం) సింగర్ హెసూ బలవన్మరణంతో ముందుగా ప్రకటించిన ఈవెంట్‌కు హాజరుకావడం లేదని నిర్వాహకులు ప్రకటించడంతో ఆమె విషాదాంతం వెలుగులోకి వచ్చింది.
హెసూ చిన్న వయసులోనే ఇంతటి తీవ్ర నిర్ణయం ఎందుకు తీసుకున్నారనేది తెలియరాలేదు. హోటల్ రూంలో సూసైడ్ నోట్ లభించడంతో దర్యాప్తులో ఇతర వివరాలు బయటపడతాయని భావిస్తున్నారు. 1993లో జన్మించిన హెసూ 2019లో మై లైఫ్, మి అనే సింగిల్ ఆల్బంతో కెరీర్‌ను ఆరంభించారు. గయో స్టేజ్, హ్యాంగవుట్ విత్ యూ, ది ట్రాట్ షో వంటి షోలు, ఆల్బమ్స్‌తో ఆమెకు పేరు ప్రఖ్యాతులు లభించాయి.
హెసూ తాను చనిపోయే ముందు రోజు కూడా సోషల్ మీడియాలో చురుకుగా వ్యవహరించారు. సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఆమె ప్రతిరోజూ తన ఫ్యాన్స్‌తో ఎన్నో విషయాలు షేర్ చేసుకునేది. యువ పాప్‌స్టార్ మరణం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆమె అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Read More