Nepal | నేపాల్‌లో మళ్లీ నిరసనలు.. బాలెన్ షా సర్కార్‌కు నెల రోజుల్లోనే నిరసనల సెగ
భారీ మెజారిటీతో పదవి చేపట్టిన నేపాల్ ప్రధాని బాలెన్ షాకు నెల రోజుల్లోపే ప్రజలు, విద్యార్థుల నుంచి నిరసన సెగ తగిలింది. రాజధాని కాఠ్మాండూ సహా పలు నగరాల్లో విద్యార్థులు, రాజకీయ గ్రూపులు, సామాన్యులు వీధుల్లోకి వచ్చి ప్రభుత్వ విధానాలపై గత రెండు, మూడు రోజులుగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.
- అవినీతి ఆరోపణలతో హోం మంత్రి గురుంగ్ రాజీనామా
కాఠ్మాండూ : భారీ మెజారిటీతో పదవి చేపట్టిన నేపాల్ ప్రధాని బాలెన్ షాకు నెల రోజుల్లోపే ప్రజలు, విద్యార్థుల నుంచి నిరసన సెగ తగిలింది. రాజధాని కాఠ్మాండూ సహా పలు నగరాల్లో విద్యార్థులు, రాజకీయ గ్రూపులు, సామాన్యులు వీధుల్లోకి వచ్చి ప్రభుత్వ విధానాలపై గత రెండు, మూడు రోజులుగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. భారత్ నుంచి కొనుగోలు చేసే రూ.100 పైబడిన వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ విధించడాన్ని సామాన్యులు తప్పు పడుతున్నారు. సరిహద్దుల్లో ఉన్న ప్రజలు అత్యవసరాల కోసం భారత్‌పై ఆధారపడతారని చెప్పారు. మరోవైపు విద్యార్థి సంఘాలను పట్టించుకోకుండా వాటిపై నిషేధం విధించినందుకు విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ యూనిఫామ్‌లోని వేలాది మంది విద్యార్థులు ప్లకార్డులు చేతపట్టి నిరసన ప్రదర్శనల్లో పాల్గొనడం కొన్ని వీడియోల్లో కనిపించింది. నిరసనల తీవ్రత పెరుగుతుండటంతో బాలెన్ షా సర్కార్‌పై ఒత్తిడి పెరుగుతున్నది.
ప్రజల అసంతృప్తి విస్తృత రాజకీయ సవాల్‌గా పరిణమించింది. ఇంకోవైపు దేశ హోం మంత్రి సుధన్ గురుంగ్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని, అనుమానాస్పద లావాదేవీల్లో పాల్గొంటున్నారని ఆరోపణలు వచ్చాయి. మనీ లాండరింగ్‌కు పాల్పడిన ఓ వ్యాపారి కంపెనీల్లో ఆయనకు షేర్లు ఉన్నాయని తెలియడంతోనే ఆయన రాజీనామాకు సొంత పార్టీ నుంచే డిమాండ్ వచ్చింది. ఈ నేపథ్యంలో తనపై వచ్చిన ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ జరిగేందు కోసం తాను రాజీనామా చేసినట్టు బుధవారం ఫేస్బుక్ పోస్ట్‌లో గురుంగ్ తెలిపారు. ఆర్థిక శాఖ ఈ ఆరోపణలపై విచారణ చేస్తుందని చెప్పారు. అధికారం స్వీకరించిన వెంటనే ఉన్నతాధికారులు, మాజీ ప్రధానుల అరెస్టుతో వార్తల్లో నిలిచిన ఆయనపై కొన్ని వారాలకే అవినీతి, ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలు రావడం గమనార్హం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

