ఆదివారం 28 ఫిబ్రవరి 2021
International - Jan 17, 2021 , 11:59:08

ట్రంప్ ఆర్డ‌ర్ల‌న్నీ రివ‌ర్స్‌.. బైడెన్ చేయ‌బోయే తొలి ప‌ని ఇదే

ట్రంప్ ఆర్డ‌ర్ల‌న్నీ రివ‌ర్స్‌.. బైడెన్ చేయ‌బోయే తొలి ప‌ని ఇదే

వాషింగ్ట‌న్‌: అమెరికా 46వ అధ్య‌క్షుడిగా బుధ‌వారం ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు జో బైడెన్‌. ఆయ‌న వ‌చ్చీ రాగానే ఇప్ప‌టి అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఆర్డ‌ర్ల‌న్నింటినీ వెన‌క్కి తీసుకోనున్నారు. తొలి రోజు ఆఫీస్‌లో పారిస్ ఒప్పందంలోకి తిరిగి చేర‌డం, ప‌లు ముస్లిం మెజార్టీ దేశాల ప్ర‌యాణికుల‌పై విధించిన నిషేధాన్ని ర‌ద్దు చేయ‌డంలాంటి కీల‌క‌మైన నిర్ణ‌యాలు తీసుకోనున్నారు. ఇవే కాదు తొలి రోజే ప‌దికిపైగా ఇలాంటి ట్రంప్ వివాదాస్ప‌ద నిర్ణ‌యాల‌న్నింటినీ రివ‌ర్స్ చేసే ఆలోచ‌న‌లో బైడెన్ ఉన్నట్లు చీఫ్ ఆఫ్ స్టాఫ్ రాన్ క్లెయిన్ వెల్ల‌డించారు. కొత్త అధ్య‌క్షుడి తొలి ప‌ది రోజుల యాక్ష‌న్ ప్లాన్‌కు సంబంధించి త‌న స్టాఫ్‌కు మెమో జారీ చేశారు. 

ఆ నాలుగు సంక్షోభాల‌పైనే..

అమెరికా ప్ర‌స్తుతం ప్ర‌ధానంగా నాలుగు సంక్షోభాల‌ను ఎదుర్కొంటున్న‌ట్లు అందులో క్లెయిన్ పేర్కొన్నారు. అందులో మొద‌టిది కొవిడ్‌-19 సంక్షోభం, రెండోది దీని ద్వారా క‌లిగిన ఆర్థిక సంక్షోభం. మూడోది ప‌ర్యావ‌ర‌ణ సంక్షోభం, నాలుగోది వ‌ర్ణ వివ‌క్ష సంక్ష‌భ‌మ‌ని క్లెయిన్ అందులో చెప్పారు. ఈ నాలుగు సంక్షోభాల‌ను ఎదుర్కోవ‌డానికి త‌న తొలి ప‌ది రోజుల్లోనే బైడెన్ ప‌లు నిర్ణ‌యాత్మ‌క చ‌ర్య‌లు తీసుకుంటార‌ని, త‌ద్వారా ప్ర‌పంచంలో అమెరికా అగ్ర‌స్థానాన్ని మ‌ళ్లీ ప‌దిలం చేసే దిశ‌గా అడుగులు వేస్తార‌ని క్లెయిన్ వివ‌రించారు. 

VIDEOS

logo