 
                                                            న్యూయార్క్: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్(JD Vance) ఇరకాటంలో పడ్డారు. హిందూ మతానికి చెందిన తన భార్య ఉషా వాన్స్.. క్రైస్తవ మతాన్ని స్వీకరించాలన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యల పట్ల జేడీ వాన్స్‌పై విమర్శలు వస్తున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ మెసిసిప్పిలో జరిగిన టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ మీటింగ్‌లో ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తన భార్య ఉషా తనతో చర్చికు హాజరవుతోందని, కానీ ఆమె ఏదో ఒక రోజు పూర్తిగా క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
క్రైస్తవ సువార్తల పట్ల ఆమె ఆకర్షితురాలుకావాలని జేడీ వాన్స్ భావించారు. నేను క్రైస్తవాన్ని నమ్ముతానని, నా భార్య కూడా క్రైస్తవాన్ని స్వీకరిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. తమ మత విశ్వాసాలు వేరైనా తమ మధ్య ఎటువంటి విబేధాలు లేవన్నారు. ఒకవేళ ఆమె మారకపోతే, అప్పుడే ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ ఉంటుందని భగవంతుడే చెబుతాడని జేడీ వాన్స్ అన్నారు. ఇదేమీ తనకు సమస్య కాదన్నారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఈ అంశంలో ఏకాభిప్రాయం అవసరమన్నారు. ప్రేమించే వ్యక్తిని కూడా పరిగణలోకి తీసుకుకోవాల్సి వస్తుందన్నారు.
జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు ఆన్లైన్లో చర్చకు దారితీసింది. అమెరికా ఉపాధ్యక్షుడు హిందుమత వ్యతిరేకి అని కొందరు ఆరోపించారు. తన భార్యపై క్రైస్తవ మత విశ్వాసాలను రుద్దుతున్నట్లు విమర్శించారు. హిందూ కుటుంబంలో పుట్టిన ఉషా వాన్స్.. అటార్నీగా చేశారు. మతాలు భిన్నమైనా.. ఇంట్లో భార్యాభర్తలు కలిసే ఉంటున్నారు. అయితే ముగ్గురు పిల్లలను మాత్రం క్రైస్తవ మతాచారాల ప్రకారం పెంచుతున్నారు.
🚨 JUST IN: JD Vance says he’s raising his children Christian, and he hopes his agnostic wife, Usha, comes around to the Christian faith
Vance’s 8-year-old did his first Communion “about a year ago,” and his two oldest kids go to a Christian school
“Most Sundays, Usha comes… pic.twitter.com/RuXAWOD58j
— Eric Daugherty (@EricLDaugh) October 30, 2025
 
                            