టోక్యో, నవంబర్ 15: జపాన్ ప్రధాని సనే తకైచి ఒక విస్తుపోయే నిజాన్ని చెప్పారు. తాను రోజూ రాత్రి కేవలం రెండు నుంచి నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతానని వెల్లడించారు. పార్లమెంట్ సమావేశాల ఏర్పాట్లకు సంబంధించి ఆమె గత వారం తెల్లవారుజామున మూడు గంటలకు తన కార్యాయలయంలో ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది. ‘నేను రోజుకు రెండు గంటలు నిద్రపోతా. ఎక్కువ అనుకుంటే నాలుగు గంటలు’ అని ఆమె లెజిస్లేటివ్ కమిటీ సమావేశంలో వెల్లడించారు. పని, జీవిత సమతుల్యతల పట్ల ఆమె నిబద్ధతను పలువురు ప్రశంసించారు.