టోక్యో, జూలై 20 : ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో జపాన్‌కు చెందిన ఒక సంస్థ ఎండలో పనిచేసే కార్మికులకు తక్షణ ఉపశమనం కోసం ‘హ్యూమన్ రిఫ్రిజిరేటర్’అనే పోర్టబుల్ కూలింగ్ బూత్‌ను అభివృద్ధి చేసింది. ‘డూ హైమాన్ బాక్స్’ అనే ఈ పరికరంలోకి వెళ్లి కూర్చుంటే, ఐదు నిమిషాల్లోనే శరీరం చల్లబడుతుంది. జపనీస్ కంపెనీ ‘ఎస్డీఆర్ఎస్’ తయారుచేసిన ఈ ‘హ్యూమన్ రిఫ్రిజిరేటర్’ ధర రూ.15 లక్షల యెన్లు (రూ.9లక్షలు) దీనిని అద్దెకు తీసుకునే సౌకర్యం ఉంది.
ఇప్పటికే ఇది పాపులర్ కావటంతో టోక్యో సహా వివిధ నగరాల్లోని బహిరంగ ప్రదేశాల్లో సామాన్యుల కోసం వీటిని ఏర్పాటుచేశారు. స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారుచేసిన ఈ బూత్, ఒక వ్యక్తి కూర్చోవడానికి సౌకర్యవంతంగా ఉం టుంది. దీని అంతర్గత ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్‌గా ఉండగా, శరీరాన్ని వేగంగా చల్లబరిచేందుకు మెడ, తల, వీపు భాగాలపైకి చల్లటి గాలిని ప్రసరింపజేస్తుంది. చల్లదనంలో కూర్చోవటం వల్ల అనారోగ్యానికి గురికాకుండా ఉండేలా, ఫ్రిజ్ తలుపులు 20 నిమిషాల్లో తెరుచుకుంటాయి.