టోక్యో, సెప్టెంబర్ 7: జాబిల్లి ఉపరితలంపై సాఫ్ట్‌ల్యాండ్ చేయడమే లక్ష్యంగా జపాన్ గురువారం ల్యాండర్‌ను ప్రయోగించింది. జపాన్‌లోని టనేగషిమా స్పేస్ సెంటర్ నుంచి స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వేస్టిగేటింగ్ మూన్ (స్లిమ్) స్పేస్‌క్రాఫ్ట్‌ను మోసుకుంటూ హెచ్2-ఏ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగించిన 13 నిమిషాల తర్వాత ఆ రాకెట్ నిర్దేశిత కక్ష్యలోకి స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రవేశపెట్టింది. మూడు నుంచి నాలుగు నెలల ప్రయాణం తర్వాత ఈ స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడి ఉపరితలాన్ని చేరుకునే అవకాశం ఉంది.