ఇస్లామాబాద్: రైల్వే ట్రాక్‌పై పేలుడు సంభవించి బలూచిస్థాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. మంగళవారం పెషావర్ నుంచి క్వెట్టాకు ప్రయాణిస్తుండగా, బలూచిస్థాన్‌లోని మస్తూంగ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో జాఫర్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన మూడు బోగీలు దెబ్బతిన్నాయని, అందులోని పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయని స్థానిక మీడియా తెలిపింది.