Elephants without Tusks : అక్కడ పెరుగుతున్న దంతాలు లేని ఏనుగుల సంఖ్య.. కారణం ఏంటి? ఏం జరుగుతోంది?
అక్కడ పెరుగుతున్న దంతాలు లేని ఏనుగుల సంఖ్య | ఏనుగులకు దంతాలే అందం. తెల్లగా మెరుస్తున్న దంతాలతో అవి అటూ ఇటూ తిరుగు
ఏనుగులకు దంతాలే అందం. తెల్లగా మెరుస్తున్న దంతాలతో అవి అటూ ఇటూ తిరుగుతుంటే ఏనుగులను చూడటానికి రెండు కళ్లు సరిపోవు. కానీ.. అక్కడ ఏనుగులకు ఇప్పుడు దంతాలు లేవు. ముఖ్యంగా ఆడ ఏనుగులు దంతాలు లేకుండా కనిపిస్తున్నాయి. రోజురోజుకూ దంతాలు లేని ఏనుగుల సంఖ్య అక్కడ పెరుగుతోంది. కొన్ని ఏనుగులు అయితే కోరలు లేకుండానే జన్మిస్తున్నాయి. ఎక్కడ ఏనుగులకు ఈ పరిస్థితి ఎదురైంది? దానికి కారణం ఏంటో తెలుసుకుందాం రండి.

సౌత్ఈస్ట్ ఆఫ్రికా దేశం మొజాంబిక్. అక్కడ ఉన్న గొరంగోసా నేషనల్ పార్క్‌లో ఉన్న ఏనుగుల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకునేది. అక్కడ ఉన్న ఏనుగులకు దంతాలు ఉండవు. దానికి కారణం తెలియాలంటే మనం ఒకసారి అక్కడ చోటు చేసుకున్న సివిల్ వార్ గురించి తెలుసుకోవాలి.
1977 నుంచి 1992లో మొజాంబిక్‌లో అంతర్యుద్ధం జరిగింది. ఆ యుద్ధానికి డబ్బులు సమకూర్చుకోవడం కోసం ఆఫ్రికా సావన్నా జాతికి చెందిన ఏనుగులపై వేట సాగించారు. వాటి దంతాలను తొలగించి వాటిని విక్రయించేవారు. దీంతో 90 శాతం వరకు ఏనుగులు అక్కడ కనుమరుగైపోయాయి.
తాజాగా మొజాంబిక్‌లో ఉన్న ఆడ ఏనుగుల్లో ఎక్కువ శాతం దంతాలు లేనివే. దానికి కారణాల కోసం అన్వేషణ సాగించిన సైంటిస్టులు.. వాటి జన్యువులను విశ్లేషించారు. అంతర్యుద్ధం ముగిశాక కూడా ఏనుగుల్లో దంతాలు లేకపోవడం అక్కడి స్థానికులను కూడా ఆశ్చర్యపరిచింది. దానికి కారణాలు వెతకగా.. దంతాలు తీసేసిన ఏనుగుల్లో జరిగిన జన్యువుల మార్పుల వల్లే వాటికి పుట్టే ఏనుగులు కూడా కోరలు లేకుండా జన్మిస్తున్నాయని.. అవి పెరిగి పెద్దయ్యాక వాటికి దంతాలే రావడం లేదని శాస్త్రవేత్తలు గుర్తించారు.
ప్రిన్స్టన్ యూనివర్సిటీకి చెందిన బయాలిస్టుల బృందం ఈ ఏనుగులపై విస్తృతంగా పరిశోధనలు జరిపింది. దంతాలు ఉన్న ఏనుగులతో పాటు దంతాలు లేని ఏనుగులపై కూడా ఈ బృందం పరిశోధన జరిపింది. దంతాలు లేని ఏనుగులు తల్లి నుంచి పొందే జన్యువులు, తండ్రి నుంచి పొందే జన్యువుల్లో తేడా ఉండటం వల్ల అవి కోరలు లేకుండా జన్మించడం జరుగుతోందని గుర్తించారు.
దంతాలు లేకపోవడం వల్ల ఏనుగులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాయని.. దంతాలు లేని ఏనుగులు ఆహారం కోసం వెతికే పద్ధతి, అవి ఆహారం తీసుకునే పద్ధతి కూడా సాధారణ ఏనుగులతో పోల్చితే వేరుగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
మళ్లీ మునుపటిలా ఏనుగులు దంతాలతో జన్మించాలన్నా.. గొరంగొసా పార్క్‌లో దంతాలతో ఏనుగులు తిరగాలన్నా.. మరికొన్నేళ్లు పడుతుందని, అప్పుడే పర్యావరణ వ్యవస్థలో ఏనుగులు భాగం అవుతాయని రీసెర్చర్స్ స్పష్టం చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
న్యూస్ చానెల్లో వెదర్ రిపోర్ట్ చదువుతుండగా స్క్రీన్‌పై అశ్లీల వీడియో ప్రత్యక్షం!
Bullet Doctor : బుల్లెట్ బండి డాక్టర్.. ఈయన స్పెషాలిటీ ఏంటో తెలుసా?
Driverless bike : డ్రైవర్‌లెస్ బైక్ వచ్చేసింది.. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియో చూశారా?
విమానం నుంచి పడిపోయిన మానవ వ్యర్థాలు.. షాకైన తోట యజమాని
పురాతన ఆయుధం : మధ్యదరా సముద్రంలో 900 ఏండ్ల నాటి కత్తి లభ్యం!
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

