పురాతన ఆయుధం : మధ్యదరా సముద్రంలో 900 ఏండ్ల నాటి కత్తి లభ్యం!

న్యూఢిల్లీ : మధ్యదరా సముద్ర జలాల నుంచి క్రూసేడర్ నైట్ ఆయుధంగా భావిస్తున్న 900 ఏండ్ల నాటి పురాతన కత్తిని ఇజ్రాయల్కు చెందిన డైవర్ బయటకు తీసుకువచ్చాడు. అక్టోబర్ 16న ఇజ్రాయల్ తీరంలో ష్లోమి కజిన్ ఈ కత్తిని సముద్ర గర్భంలో చూశాడు. ఈ ఆయుధంతో పాటు సముద్ర గర్భంలో మరెన్నో పురాతన సామాగ్రిని కజిన్ కనుగొన్నాడు. ఈ కత్తి 130 సెంటీమీటర్ల పొడవుతో ఏమాత్రం చెక్కుచెదరని రీతిలో ఉందని నిపుణులు పేర్కొన్నారు. ఇది 900 ఏండ్ల నాటి కత్తి అని చెబుతున్నారు.
ఇజ్రాయల్ పురాతత్వ అధారిటీకి కజిన్ ఈ ఆయుధాన్ని అప్పగించిన తర్వాత పరిశోధకులు దీన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఇనుముతో తయారైన ఈ కత్తి ఇప్పటికీ చెక్కుచెదరలేదని, ఈ ఆయుధం మనల్ని 900 సంవత్సరాల వెనక్కి తీసుకువెళ్లి అప్పటి కత్తులు, ఆయుధ సామాగ్రి తీరుతెన్నులను కండ్లకు కడుతోందని అధారిటీ రాబరీ ప్రివెన్షన్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్ నిర్ డిటెల్ఫెల్డ్ పేర్కొన్నారు.
కజిన్ బయటకు తీసుకువచ్చిన పురాతన వస్తువులన్నింటినీ త్వరలో ప్రదర్శనకు పెట్టనున్నారు. ఇక అరుదైన ఆయుధాలే కాకుండా ఇజ్రాయల్లోని సెంట్రల్ టౌన్ యానేలో పురాతన భారీ వైన్మేకింగ్ కాంప్లెక్స్ బయటపడింది. ఈ ప్రదేశానికి 1500 ఏండ్ల నాటి చరిత్ర ఉందని పరిశోధకులు గుర్తించారు.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

