గాజా: ఇజ్రాయిల్, హమాస్ మధ్య వార్ మళ్లీ విధ్వంసకరంగా మారింది. ఇవాళ దక్షిణ గాజా నగరమైన రాఫాపై ఇజ్రాయిల్ దళాలు(Israeli Strikes) మెరుపు దాడి చేశాయి. ఆ వైమానిక అటాక్లో పాలస్తీనియన్లు మృతిచెందినట్లు తెలుస్తోంది. మెరుపు దాడి వల్ల రఫాలో సుమారు 67 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు హమాస్ ఆరోగ్యశాఖ తెలిపింది. రఫా నగరంలో దాదాపు 15 లక్షల మంది శరణార్థులుగా ఉన్నట్లు తెలుస్తోంది.
రఫాలో ఉన్న ఇద్దరు బంధీలను రక్షించినట్లు ఇజ్రాయిల్ చెప్పింది. ఆ నగరం మధ్యలో ఉన్న ఓ బిల్డింగ్లో ఉన్న వృద్దులను కాపాడారు. రఫాపై అటాక్ చేయాలన్న ప్లాన్ను అంతర్జాతీయ సమాజం వ్యతిరేకించినా ఇజ్రాయిల్ మాత్రం అనుకున్నట్లే చేసింది.
గత ఏడాది అక్టోబర్ 7వ తేదీన గాజాపై హమాస్ అటాక్ చేసిన తర్వాత ఇజ్రాయిల్ ప్రతిదాడులు మొదలుపెట్టింది. అక్టోబర్ 7 అటాక్లో 1200 మంది ప్రాణాలు కోల్పోయారు. 253 మందిని హైజాక్ చేశారు. ఇజ్రాయిల్ దాడుల్లో సుమారు 28వేల మంది పాలస్తీనియన్లు మృతిచెందినట్లు హమాస్ ఆరోగ్యశాఖ పేర్కొన్నది.