జెరూసలేం: ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమాసియా మళ్లీ రణరంగంగా మారింది. ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడుల్లో 400మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. తాజాగా టెల్అవీవ్ దళాలు మరోసారి గురువారం వైమానిక దాడులతో విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో దాదాపు 70 మంది ప్రాణాలు కోల్పోయినట్టు స్థానిక అధికారులు తెలిపారు. ఇందులో ఓ మహిళతో సహా అనేక మంది చిన్నారులు ఉన్నట్టు వెల్లడించారు.
బందీలందరినీ విడుదల చేయడానికి ఇదే చివరి అవకాశమని ఇజ్రాయెల్ రక్షణమంత్రి కాట్జ్ గాజాకు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు..నెట్జారిమ్ టెల్అవీవ్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి బందీల ప్రాణాలను ప్రమాదంలో పడేసిందని పేర్కొన్నది. ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.