3D print fish | జెరూసలెం, మే 4: మీకు చేపలు తినాలని ఉందా? మార్కెట్లో దొరకడం లేదా? అయితే త్వరలోనే కృత్రిమంగా ప్రింట్ చేసిన చేపలు మార్కెట్లోకి రానున్నాయి. ఇజ్రాయెల్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ స్టీక్హోల్డ్ ఫుడ్స్ 3డీ ప్రింటెడ్ చేపలను తయారు చేస్తున్నది. సింగపూర్‌కు చెందిన ఉమామి మీట్స్‌తో కలిసి ఈ ప్రయోగాలు నిర్వహిస్తున్నది.
ఉమామి మీట్స్ సంస్థ చేపల గుంపు నుంచి కణాలను సమీకరించి వాటిని కొవ్వు, కండరాలుగా అభివృద్ధి చేస్తున్నది. స్టీక్హోల్డ్ ఫుడ్స్ వీటికి బయో ఇంక్‌ను చేర్చి 3డీ ప్రింటర్ సాయంతో చేప ముక్కలను ప్రింట్ చేస్తున్నది. 2024లో మొదటగా వీటిని సింగపూర్ మార్కెట్లోకి ప్రవేశపెడతారు. అనంతరం అమెరికా, జపాన్‌లకు ఎగుమతి చేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు. అక్కడ విజయవంతం అయితే అనతికాలంలోనే భారత్ మార్కెట్లోనూ దర్శనమిచ్చే అవకాశం లేకపోలేదు.