Israel attack : పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడికి పాల్పడింది. ఈ దాడిలో 33 మంది పాలస్తీనియన్లు దుర్మరణం పాలయ్యారు. మరో 80 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో 21 మంది మహిళలే ఉన్నారు. పరిస్థితిని బట్టి చూస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
నార్త్ గాజాలోని జబాలియా శరణార్థి శిబిరంపై ఈ దాడి జరిగిందని గాజాలోని అధికారులు వెల్లడించారు. కాగా తాజా దాడిలో మరణించిన 33 మందితో కలిపి ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు మొత్తం 42,500 మందికిపైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో లక్ష మందికిపైగా గాయపడ్డారు. గాజాలోని హమాస్ మిలిటెంట్లే లక్ష్యంగా గత కొన్ని నెలల నుంచి ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది.