HomeInternationalIsraeli Army Chief Herzi Halevi Announces Resignation
ఇజ్రాయెల్ సైన్యాధిపతి రాజీనామా
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన కొద్ది గంటల్లోనే.. ఇజ్రాయెల్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ సైన్యాధిపతి హెర్జి హాలివీ రాజీనామా ప్రకటించారు.
అక్టోబర్ 7 నాటి దాడిని అడ్డుకోవటంలో విఫలమైనందుకు
జెరూసలేం: ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన కొద్ది గంటల్లోనే.. ఇజ్రాయెల్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ సైన్యాధిపతి హెర్జి హాలివీ రాజీనామా ప్రకటించారు. మార్చి 6న తాను బాధ్యతల నుంచి వైదొలగుతున్నట్టు మంగళవారం తెలిపారు. గతేడాది అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్స్ దాడిని పసిగట్టడంలో, అడ్డుకోవటంలో విఫలమైనందుకు రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు.
ఆనాటి దాడి నుంచి ఇజ్రాయెల్‌కు రక్షణ కల్పించటంలో తన మిషన్ విఫలమైందని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. మరో ఉన్నతాధికారి మేజర్ జనరల్ యారోన్ ఫింకెల్మాన్లు కూడా బాధ్యతల నుంచి తప్పుకుంటూ రాజీనామా సమర్పించారు. ఆనాటి హమాస్ దాడి వైఫల్యాలపై విచారణ జరపాలన్న డిమాండ్ ఇజ్రాయెల్‌లో ఊపందుకుంది.