Gaza | గాజా స్ట్రిప్, : గాజాలో పాలస్తీనియన్ల మరణాలు 50వేలు దాటినట్లు గాజా ఆరోగ్య శాఖ తాజాగా ప్రకటించింది. శనివారం రాత్రి నుంచి ఇజ్రాయెల్ జరుపుతున్న వైమానిక దాడుల్లో 26 మంది మరణించారు. మృతుల్లో పాలస్తీనియన్ పార్లమెంట్, పొలిటికల్ బ్యూరో సభ్యుడు, హమాస్ రాజకీయ నేత సలా బర్దావిల్, అతని భార్య కూడా ఉన్నట్టు అధికారులు తెలిపారు. యుద్ధంలో ఇప్పటివరకు 1,13,000 మంది గాయపడ్డట్టు ఆరోగ్య శాఖ ప్రకటించింది.