గాజా: గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో శుక్రవారం 77 మంది మరణించినట్లు గాజా ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించింది. మృతుల్లో ఐదుగురు చిన్నారులున్నారని, 174 మంది గాయపడ్డారని తెలిపింది. నిరాశ్రయులు తలదాచుకున్న షాబన్ రయీస్ స్కూలుపై గురువారం ఇజ్రాయెల్ సేనలు జరిపిన వైమానిక దాడులలో ఐదుగురు పిల్లలతోసహా 12 మంది మరణించారు.
గురువారం తెల్లవారుజామున దీర్ అల్ బలాలోని మగజీ శరణార్థ శిబిరంపై జరిగిన మరో వైమానిక దాడిలో ఐదుగురు మరణించారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు గాజాలో మొత్తం 45,206 మంది మరణించారు.