జెరూసలెం : నిత్యం సందర్శకులు, మార్నింగ్ వాక్, జాగింగ్‌కు వచ్చే ప్రజలతో సందడిగా ఉండే టెల్ అవివ్‌లోని ప్రముఖ బీచ్ ఇజ్రాయెల్-హమాస్ వార్తో (Israel-Hamas war) ఇప్పుడు సందర్శకులు లేక వెలవెలపోతోంది. రాకెట్ దాడులు, ఇతర ఉగ్ర దాడుల భయంతో స్ధానికులు ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయల్‌లోని దక్షిణ, మధ్య ప్రాంతాల్లో మెరుపుదాడులతో హమాస్ విరుచుకుపడింది.
హమాస్ ఉగ్రమూకలు అమానవీయంగా వ్యవహరిస్తున్నారని, రాక్షస మూక మూర్ఖత్వంతో దాడులకు తెగబడుతున్నదని ఇజ్రాయెల్ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ దేశం పుట్టకముందే తాను ఇక్కడ పుట్టానని, గతంలో ఇలా ఎన్నడూ జరగలేదని పేర్కొంది.
తాము ప్రతి రోజూ బీచ్‌కు వెళతామని, దక్షిణ, ఉత్తర ప్రాంతాలతో పోలిస్తే టెల్ అవివ్ సురక్షిత నగరమని, ప్రస్తుతం బీచ్‌లో జనం పలుచగా ఉన్నారని, వీధుల్లోనూ ప్రజలు కనిపించడం లేదని మరో మహిళ చెప్పుకొచ్చింది. ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రదాడుల్లో ఇప్పటివరకూ 1300 మంది మరణించగా, 3000 మందికి పైగా గాయపడ్డారు. గాజాలో 120 మందికిపైగా పౌరులను హమాస్ బందీలుగా చేసుకుందని ఐడీఎఫ్ పేర్కొంది.
Read More :
Sowbhagya Lakshmi | మహిళలకు గుడ్ న్యూస్.. బీపీఎల్ కార్డు కలిగిన వారికి రూ. 3 వేల భృతి