ఇజ్రాయెల్ ఎన్నికల్లో విదేశీ జోక్యం?
విదేశీ నిధులు, ఓటర్లకు లంచాలు ఇవ్వడం ద్వారా అరబ్ నేతృత్వంలోని పార్టీలు ఓట్ల చౌర్యానికి పాల్పడ్డాయని ప్రధాని నెతన్యాహు ఆరోపించడంతో ఇజ్రాయెల్ ఎన్నికలు రాజకీయ దుమారాన్ని రేపాయి. అయితే ఈ ఆరోపణలకు బహిరంగంగా సమర్పించిన ఆధారాలేవీ లేవు.
- ఓటు చోరీకి పాల్పడ్డ అరబ్ పార్టీలు
- నెతన్యాహు ఆరోపణలు.. రాజకీయ దుమారం
న్యూఢిల్లీ : విదేశీ నిధులు, ఓటర్లకు లంచాలు ఇవ్వడం ద్వారా అరబ్ నేతృత్వంలోని పార్టీలు ఓట్ల చౌర్యానికి పాల్పడ్డాయని ప్రధాని నెతన్యాహు ఆరోపించడంతో ఇజ్రాయెల్ ఎన్నికలు రాజకీయ దుమారాన్ని రేపాయి. అయితే ఈ ఆరోపణలకు బహిరంగంగా సమర్పించిన ఆధారాలేవీ లేవు. విదేశీ జోక్యంపై వెల్లువెత్తిన అనుమానాలపై దర్యాప్తు చేయాలని కేంద్ర ఎన్నికల కమిటీ అధిపతి ప్రధాన న్యాయమూర్తి నోమ్ సోల్బర్గ్ దేశ అంతర్గత భద్రతా సంస్థ షిన్‌బెట్‌ను కోరడంతో ఈ వివాదం మరింత తీవ్రమైంది. నెతన్యాహు కూటమి 53 స్థానాలను, గాడి ఐసెన్‌కోట్ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీలు 48 స్థానాలను, అరబ్ పార్టీలు 19 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండటంతో 120 మంది సభ్యులున్న నెసెట్(ఇజ్రాయెల్ పార్లమెంట్)లో మెజారిటీకి అవసరమైన 61 స్థానాలను ఏ కూటమి కూడా సాధించలేకపోయింది. ఈ ఆరోపణలు ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రయత్నాలను మరింత క్లిష్టతరం చేశాయి.
అరబ్ నేతృత్వంలోని పార్టీలు ఎన్నికల్లో మోసానికి పాల్పడ్డాయని నెతన్యాహుకు చెందిన లికుడ్ పార్టీ ఆరోపించింది. లంచాలు, బెదిరింపులు, హింస, నకిలీ పత్రాలు, బహుళ ఓటింగ్ వంటి ఆరోపణలు చేసింది. పోలీసులు, షిన్ బెట్, కేంద్ర ఎన్నికల కమిటీ విచారణ జరపాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. కాగా వ్యవస్థీకృత ఎన్నికల మోసానికి సంబంధించిన ఆధారాలను అధికారులు బహిరంగంగా సమర్పించలేదు. ఇజ్రాయెల్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలు నిధులు అందించడం ద్వారా అనుచిత విదేశీ ప్రభావం చూపుతున్నాయన్న అనుమానాలపై దర్యాప్తు చేయాలని ఎన్నికల కమిటీ అధిపతి నోమ్ సోల్బర్గ్ షిన్‌బెట్ అధిపతి డేవిడ్ జినిని కోరడంతో ఈ వివాదం తీవ్రరూపం దాల్చింది. అయితే ఆ ఆరోపణలను తాను ధృవీకరించలేదని, సమగ్ర దర్యాప్తు అవసరమని భావిస్తున్నానని సోల్బర్గ్ తెలిపారు.
విదేశీ జోక్యం : నెతన్యాహు
ఈ ఆరోపణలను ‘భూకంపం’గా అభివర్ణించిన నెతన్యాహు ఎన్నికలను చోరీ చేశారని ఆరోపించారు. అరబ్ నేతృత్వంలోని పార్టీలైన రామ్, జాయింట్ లిస్ట్‌లకు అనుకూలంగా ఫలితాలను ప్రభావితం చేయడానికి విదేశీ సంస్థలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఈ జోక్యం మితవాద పాలనను బలహీనపరిచేందుకు, ఇజ్రాయెల్ భద్రతా విధానాలను ప్రభావితం చేసేందుకు ఉద్దేశించినవని కూడా ఆయన ఆరోపించారు. అరబ్ ఓటర్లను సమీకరించడంలో పాలుపంచుకుంటున్న సంస్థలకు పంపిన నిధులను ఖతార్, తుర్కియే దేశాలే మూలమై ఉండవచ్చని నెతన్యాహుకు చెందిన లికుడ్ పార్టీ అనుమానిస్తున్నట్టు హిబ్రూ భాష మీడియా కథనాలు తెలిపాయి.
అరబ్ పార్టీల స్పందన
అరబ్ నేతృత్వంలోని పార్టీలు ఈ ఆరోపణలను తిరస్కరించాయి. అరబ్ ఓటర్లను, తమ ఎన్నికల విజయాలను అప్రతిష్టపాలు చేయడానికి లికుడ్ ప్రయత్నిస్తున్నదని అవి ఆరోపించాయి. జాయింట్ లిస్ట్ నాయకుడు అహ్మద్ టీబీ మోసం ఆరోపణలను కొట్టిపారేయగా ఇతర అరబ్ పార్టీల నాయకులు ఈ ఆరోపణలను ప్రజాస్వామ్య ప్రక్రియను బలహీనపరిచి, ఇజ్రాయెల్‌లోని పాలస్తీనా పౌరులను అణగదొక్కే ప్రయత్నంగా అభివర్ణించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

