జెరూసలేం: ఇరాన్‌పై దాడుల కోసం ఇజ్రాయెల్ ఒక రహస్య సైనిక స్థావరాన్ని ఇరాక్ ఎడారుల్లో నిర్మించినట్టు తాజా నివేదిక ఒకటి పేర్కొన్నది. ఒకవేళ ఇజ్రాయెల్ యుద్ధ విమానం ఏదైనా కూలితే, దాంట్లోని పైలట్లను రెస్క్యూ చేసేందుకు.. అక్కడ ప్రత్యేక దళాల సైనికులు, సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలు ఉన్నాయని ఈ నివేదిక తెలిపింది. అమెరికా అధికారిక వర్గాలను ఉటంకిస్తూ ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ ఈ నివేదికను ప్రచురించింది.
ఫిబ్రవరి 28 నుంచి అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై భీకర యుద్ధానికి తెరలేపాయి. ఇరాన్‌పై పెద్ద ఎత్తున వైమానిక చేపట్టాయి. ఆ దేశంపై తన వైమానిక దాడులకు మద్దతుగా ఇజ్రాయెల్ అంతక్రితమే ఇరాక్ ఎడారిలో ఒక రహస్య మిలిటరీ బేస్‌ను ఏర్పాటుచేసిన విషయం వెలుగుచూసింది. మార్చిలో ఒక మారుమూల ప్రాంతంలో హెలికాప్టర్లతో కూడిన అసాధారణ సైనిక కార్యకలాపాలను ఒక స్థానిక గొర్రెల కాపరి చూసిన తర్వాత, ఇరాకీ దళా లు ఆ ఔట్‌పోస్ట్‌ను గుర్తించాయి.