Iran Embassy | న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: సిరియా రాజధానిలోని ఇరాన్ రాయబార కార్యాలయ భవనంపై ఇజ్రాయెల్ సోమవారం దాడులకు దిగింది. ఈ దాడుల్లో ఇరాన్ ఎంబసీ అనెక్స్‌లో సీనియర్ ఇరానియన్ కమాండర్ సహా 8 మంది మృతిచెందినట్టు వార్ మానిటర్ నివేదిక వెల్లడించినట్టు స్థానిక మీడియా తెలిపింది. డమాస్కస్‌లోని మజ్జే పరిసరాల్లోని ఇరాన్ కాన్సులేట్ భవనాన్ని ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్నట్టు సిరియా అధికారిక వార్తా సంస్థ సనా తెలిపింది.
బాంబు దాడి జరిగిన ప్రదేశాన్ని వార్తా ఏజెన్సీలు ధృవీకరించాయి. దాడిలో రాయబార కార్యాలయం పక్కన ఉన్న అనుబంధ భవనం నేలమట్టమైంది. ఈ దాడుల్లో ఇరాన్ కమాండర్ మహ్మద్ రెజా జాహెదీ మరణించినట్టు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్ వెల్లడించింది. తాజా దాడిపై ఇరాన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.