న్యూఢిల్లీ, మార్చి 15: అమెరికా సారథ్యంలోని సంకీర్ణ దళాలలో పనిచేస్తున్న తమ దేశానికి చెందిన జాతీయ నిఘా సర్వీసు సిబ్బంది ఇరాక్, సిరియా దేశాల ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) అగ్ర నాయకుడిని చంపివేసినట్టు ఇరాక్ ప్రధాని శనివారం ప్రకటించారు.
తమ దేశంలో చీకట్లను, ఉగ్రవాదాన్ని నింపుతున్న శక్తులకు తమ దేశ పౌరులే శిక్ష విధిస్తున్నారని ఎక్స్ వేదికగా ప్రధాని మొహమ్మద్ షియా అల్ సుడానీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్కి డిప్యుటీ కలీఫ్గా పనిచేస్తున్న అబ్దుల్లా మకీ మొస్తే అల్ రిఫాయి లేదా అబూ ఖదీజాను సంకీర్ణ దళాలు మట్టుపెట్టినట్టు ఆయన తెలిపారు.