GT vs PBKS | రాణించిన గిల్, బట్లర్.. పంజాబ్‌ను ఊరిస్తున్న లక్ష్యం..!
GT vs PBKS : పంతొమ్మిదో సీజన్ తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ మోస్తరు స్కోర్‌కే పరిమితమైంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(39), జోస్ బట్లర్(38)లు రాణించారు.
GT vs PBKS : పంతొమ్మిదో సీజన్ తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ మోస్తరు స్కోర్‌కే పరిమితమైంది. ముల్లన్‌పూర్‌లో పంజాబ్ కింగ్స్ బౌలర్ల ధాటికి హిటర్లు చేతులెత్తేయగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్(39), జోస్ బట్లర్ (38)లు రాణించారు. బట్లర్ ఔటయ్యాక బ్యాట్ ఝులిపించే వాళ్లు లేకపోవడంతో గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.
ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్లో గుజరాత్ టైటాన్స్ శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఓపెనర్లు సాయి సుదర్శన్(13), శుభ్‌మన్ గిల్(39)లు రాణించినా.. సొంత మైదానంలో పంజాబ్ కింగ్స్ బౌలర్ల ధాటికి గుజరాత్ మిడిలార్డర్ తేలిపోయింది. సాయిని ఔట్ చేసిన యాన్సెన్ తొలి బ్రేకివ్వగా.. జోస్ బట్లర్(38)తో కలిసి గిల్ ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ, చాహల్ ఓవర్లో అతడు కొన్నొల్లి చేతికి చిక్కడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది.
Big wicket for @PunjabKingsIPL 💥@yuzi_chahal with the 2️⃣2️⃣2️⃣nd wicket of his #TATAIPL career ☝🏼#GT 89/2 in 11 overs
Updates ▶️ https://t.co/75rCxTCOL1#KhelBindaas | #PBKSvGT pic.twitter.com/COatldEYKs
— IndianPremierLeague (@IPL) March 31, 2026
అనంతరం గ్లెన్ ఫిలిప్స్(25) మెరుపు బ్యాటింగ్‌తో అలరించి స్కోర్‌బోర్డును ఉరికించాడు. అయితే.. విజయ్‌కుమార్ ఓవర్లో అతడు అర్ష్‌దీప్ చేతికి చిక్కగా.. కాసేపటికే చాహల్ బౌలింగ్‌లో సిక్సర్‌కు యత్నించిన బట్లర్ బౌండరీ లైన్ వద్ద బార్ట్లెట్ పైకెగిరి క్యాచ్ అందుకోవడంతో వెనుదిరిగాడు. ఆ తర్వాత పంజాబ్ బౌలర్లు మరింత కట్టుదిట్టంగా బంతులు సంధించగా వాసింగ్టన్ సుందర్(18), షారుక్ ఖాన్(4), రాహుల్ తెవాటియా (11నాటౌట్)లు బౌండరీలు కొట్టేందుకు ఇబ్బంది పడ్డారు. చివరి ఓవర్లో అర్ష్‌దీప్ వైడ్స్ వేయడంతో గుజరాత్ 6 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేయగలిగింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

