Instagram | ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్‌పై ఐర్లాండ్ కొరఢా ఝుళిపించింది. ఆ దేశ డేటా ప్రైవసీ రెగ్యులేటర్ ఇన్‌స్టాగ్రామ్‌పై రికార్డు స్థాయిలో 405 మిలియన్ యూరోలు జరిమానా విధించింది. పిల్లల డేటా నిర్వహణలో అవకతవకలపై విచార జరిపిన తర్వాత రెగ్యులేటరి చర్యలు చేపట్టింది. ఇన్స్టాగ్రామ్ ప్రస్తుతం మెటా ఆధ్వర్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
గత శుక్రవారం రెగ్యులేటరి ఈ నిర్ణయం తీసుకుందని ఐర్లాండ్ డేటా ప్రొటక్షన్ కమిషనర్ ప్రతినిధి తెలిపారు. ఈ నిర్ణయానికి సంబంధించి పూర్తి వివరాలు వచ్చే వారంలో వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. అయితే, జరిమానాపై ఇన్స్టాగ్రామ్ అప్పీల్ చేయాలని యోచిస్తున్నది. ఇన్స్టాగ్రామ్ ఏడాది క్రితం తన సెట్టింగ్స్‌ను అప్డేట్ చేసిందని, టీనేజ్లను సురక్షితంగా వారి సమాచారాన్ని ప్రైవేట్‌గా
ఉంచడానికి కొత్త ఫీచర్లను విడుదల చేసిందని మెటా ప్రతినిధి తెలిపారు.