IRGC : హర్మూజ్ జలసంధిని దిగ్భందిస్తామని, నౌకల రాకపోకలను అడ్డుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించడంపై ఇరాన్ భగ్గుమంది. చర్చలు విఫలమైన వేళ ట్రంప్ హర్మూజ్‌పై పెత్తనం చెలాయించాలని చూడడాన్ని ఖండించిన ఇరాన్ శత్రువు ప్రాణాంతకమైన సుడిగుండాల్లో చిక్కుకుంటారని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్(IRGC) హెచ్చరించింది. అంతేకాదు ఇరాన్ భద్రతా దళాలు హర్మూజ్‌ను తమ నియంత్రణలోకి తీసుకుంటాయని ఐఆర్జీసీ వెల్లడించింది.
పాకిస్థాన్ గడ్డపై అమెరికా, ఇరాన్ మధ్య సయోధ్య కుదరకపోవడంతో మళ్లీ పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి. హర్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలను అడ్డుకోవాలని ఆదివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ సైన్యాన్ని ఆదేశించారు. ట్రంప్ ప్రకటనను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ట్రంప్ ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఐఆర్జీసీ తమ నౌకా దళంతో పర్షియన్ భాషలో పోస్ట్ పెట్టింది.
‘హర్మూజ్ గుండా నౌకల రవాణా పూర్తిగా మా సైన్యం నియంత్రణలో ఉండనుంది. శత్రవులు ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే హర్మూజ్‌లోని ప్రాణాంతకమైన సుడిగుండాల్లో చిక్కుకుంటారు’ ఆ పోస్ట్‌లో అమెరికాను హెచ్చరించింది.
BREAKING: Iran’s Islamic Revolutionary Guard Corps (IRGC) has said that any military vessels approaching the Strait of Hormuz will be considered a ceasefire violation and “dealt with strongly”, Reuters reports. pic.twitter.com/WC99KzECC5
— Al Jazeera Breaking News (@AJENews) April 12, 2026
పశ్చిమాసియాలో తాత్కాలిక యుద్ధ విరమణ తర్వాత పాకిస్థాన్ మధ్యవర్తిత్వంలో ఇరాన్, అమెరికా చర్చలు జరిపాయి. 21 గంటల పాటు ఇరుదేశాల ప్రతినిధులు పరస్పరం తమ షరతులపై చర్చించారు. కానీ, చివరకు ఎలాంటి ఒప్పందం కుదరలేదు. దాంతో, ఇరాన్‌తో చర్చలు విఫలమయ్యాయని, అణ్వాయుధాలను తయారు చేయబోమని ఇరాన్ నుంచి తమకు స్పష్టమైన హామీ రాలేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్కొన్నారు.
President Trump on Truth Social: So, there you have it, the meeting went well, most points were agreed to, but the only point that really mattered, NUCLEAR, was not.
Effective immediately, the United States Navy, the Finest in the World, will begin the process of BLOCKADING any… pic.twitter.com/OtgoJyD8AI
— Donald J Trump Posts TruthSocial (@TruthTrumpPost) April 12, 2026
అయితే.. ఇరాన్ మాత్రం యుద్ధంలో సాధించలేని లక్ష్యాలను అమెరికా చర్చల ద్వారా నెరవేర్చుకోవాలని పతం పట్టిందని చెప్పింది. ఇప్పటికే వ్యూహాత్మకంగా హర్మూజ్‌లో భారీగా పేలుడు పదార్ధాలను ఏర్పాటు చేసిన ఇరాన్… వాటిని ఏ క్షణంలోనైనా పేల్చేసి అమెరికాను భయభ్రాంతులకు గురి చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు సమాచారం.