ఇరాన్ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన… హిజాబ్ తొలగించి నిరసన
శనివారం అమి అంత్యక్రియల సందర్భంగా ఇరాన్ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. హిజాబ్ తొలగించి నిరసన తెలిపారు.
టెహ్రాన్: హిజాబ్ ధరించనందుకు ఇరాన్‌కు చెందిన ఒక యువతిని ఆ దేశ ‘నైతిక పోలీసులు’ అరెస్ట్ చేశారు. అయితే పోలీస్ కస్టడీలో ఉన్న ఆ మహిళ మూడు రోజుల తర్వాత అనుమానాస్పద స్థితిలో మరణించింది. 22 ఏళ్ల మహ్సా అమిని తన కుటుంబంతో కలిసి ఇరాన్ రాజధాని టెహ్రాన్ సందర్శనకు వెళ్లింది. ఆ దేశ మహిళలు కఠినమైన దుస్తుల కోడ్ పాటించేలా బాధ్యత వహించే పోలీసులు ఆమె హిజాబ్ ధరించకపోవడాన్ని గమనించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆ యువతిని అరెస్ట్ చేశారు. అయితే నైతిక పోలీసుల కస్టడీలో ఉన్న ఆమె మూడు రోజుల తర్వాత కోమాలోకి వెళ్లింది. ఆసుపత్రికి తరలించగా ఆ యువతి చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.

కాగా, ఈ సంఘటన ఇరాన్‌తోపాటు ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది. ముస్లిం మహిళల డ్రెస్ కోడ్ పట్ల కఠినంగా వ్యవహరించే పోలీసులు ఆమెను చిత్రహింసలకు గురి చేశారని, తలపై కొట్టడంతో ఆ యువతి కోమాలోకి వెళ్లి చనిపోయిందని ఆమె కుటుంబ సభ్యులతోపాటు కొన్ని వార్తా సంస్థలు ఆరోపించాయి.
ఈ నేపథ్యంలో శనివారం అమి అంత్యక్రియల సందర్భంగా ఇరాన్ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. హిజాబ్ తొలగించి నిరసన తెలిపారు. ‘నియంతృత్వం మరణించాలి’ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో భద్రతా బలగాలు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించిన నిరసనకారులను చెదరగొట్టారు. అయితే హిజాబ్ తొలగించి నిరసన తెలిపిన ఇరాన్ మహిళల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మరోవైపు ప్రపంచ మానవ హక్కుల సంస్థ అమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఇరాన్‌లోని అమెరికా ప్రతినిధులు కూడా ఈ దారుణాన్ని ఖండించారు. చిత్రహింసలకు గురిచేసి యువతి మహ్సా అమి మరణానికి కారణమైన వారిని న్యాయవ్యవస్థ ద్వారా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Women of Iran-Saghez removed their headscarves in protest against the murder of Mahsa Amini 22 Yr old woman by hijab police and chanting:
death to dictator!
Removing hijab is a punishable crime in Iran. We call on women and men around the world to show solidarity. #مهسا_امینی pic.twitter.com/ActEYqOr1Q
— Masih Alinejad (@AlinejadMasih) September 17, 2022
Iran: Anti-regime protests erupted in Sanandaj tonight. A banner of former IRGC’s Quds commander, Gen. Soleimani took down by the people. #MahsaAmini pic.twitter.com/0l6LHcCF41
— Ali Kheradpir (@AliKheradpir) September 17, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

