Watch: ఇరాన్ మహిళలపై పెరుగుతో దాడి.. హిజాబ్ ధరించనందుకు అరెస్ట్
Hijab | ఇద్దరు మహిళలు హిజాబ్ ( Hijab) ధరించకుండా ఒక షాప్ వద్దకు వెళ్లారు. గమనించిన ఒక వ్యక్తి హడావుడిగా అక్కడకు వచ్చాడు. హిజాబ్ ఎందుకు ధరించలేదని ఆ మహిళలను నిలదీశాడు. వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో అతడు ఆగ్రహంతో రగిలిపోయాడు. ఆ షాప్‌లోని ర్యాక్‌లో ఉన్న పెద్ద పెరుగు కప్‌ను తీసుకుని ఆ మహిళల తలపై పోశాడు.
టెహ్రాన్: ఇరాన్ మహిళలు (Iranian Women ) తప్పనిసరిగా హిజాబ్ (Hijab) ధరించాలని ఆ దేశం ఆదేశించింది. దీనిని పాటించని వారిపై కఠిన చర్యలు చేపడుతున్నది. తాజాగా గురువారం జరిగిన ఒక సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇద్దరు మహిళలు హిజాబ్ ధరించకుండా ఒక షాప్ వద్దకు వెళ్లారు. గమనించిన ఒక వ్యక్తి హడావుడిగా అక్కడకు వచ్చాడు. హిజాబ్ ఎందుకు ధరించలేదని ఆ మహిళలను నిలదీశాడు. వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో అతడు ఆగ్రహంతో రగిలిపోయాడు. ఆ షాప్‌లోని ర్యాక్‌లో ఉన్న పెద్ద పెరుగు కప్‌ను తీసుకుని ఆ మహిళల తలపై పోశాడు. దీంతో షాపు వ్యక్తి అతడ్ని ప్రతిఘటించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, ఈ సంఘటనపై ఇరాన్ పోలీసులు స్పందించారు. హిజాబ్ ధరించని ఆ ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు. అలాగే పబ్లిక్ ఆర్డర్‌కు విఘాతం కలిగించినందుకు మహిళలపై పెరుగుతో దాడి చేసిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. హిజాబ్ ధరించని మహిళలను షాపులోకి అనుమతించడంతోపాటు ఆ చట్టాన్ని పాటించనందుకు ఆ షాపు యజమానికి నోటీసులు జారీ చేశారు.
మరోవైపు హిజాబ్ ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో కనిపించే మహిళలపై కనికారం లేకుండా చర్యలు తీసుకుంటామని, కఠినంగా శిక్షిస్తామని ఇరాన్ న్యాయవ్యవస్థ చీఫ్ ఇటీవల హెచ్చరించారు. హిజాబ్ చట్టాన్ని తప్పని సరిగా పాటించాలని పేర్కొన్నారు. ఈ చట్టం ప్రకారం ఏడేళ్ల వయస్సున్న బాలికలతో సహా మహిళలంతా బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా హిజాబ్ ధరించాలి. అయితే హిజాబ్‌ను వ్యతిరేకిస్తున్న ఆ దేశ మహిళలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు.
مشهد، شاندیز
از صفحه یاسر عرب pic.twitter.com/zstrtACMQD— Mehdi Nakhl Ahmadi (مهدی نخلاحمدی) (@MehdiNakhl) March 31, 2023
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

