Strait Of Hormuz | గుడ్‌న్యూస్.. హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచిన ఇరాన్.. అన్ని నౌకలకు అనుమతి
Strait Of Hormuz : ప్రపంచానికి ఇది గుడ్‌న్యూస్. అందరూ ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతుందా అని ఎదురుచూసిన హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది.
Strait Of Hormuz : ప్రపంచానికి ఇది గుడ్‌న్యూస్. అందరూ ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతుందా అని ఎదురుచూసిన హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ ఈ మేరకు సోషల్ మీడియాలో దీనిపై శుక్రవారం ఒక ప్రకటన చేశారు. ఇకపై హార్ముజ్ జలసంధి అందరికీ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఇటీవలే అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య గురువారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. పది రోజులపాటు కాల్పుల విరమణ కొనసాగనుంది.
ఈ నేపథ్యంలోనే హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నంత కాలం జలసంధి తెరిచి ఉంచే అవకాశం ఉంది. ‘‘లెబనాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం అమలు నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నాం. ఈ ఒప్పందం అమలులో ఉన్నంతకాలం హార్ముజ్‌ను అందరికీ అందుబాటులోకి తెస్తున్నాం. అన్ని రకాల వాణిజ్య నౌకల్ని అనుమతిస్తాం. ఈ అంశంపై ఇప్పటికే అన్ని పోర్టులకు సమాచారం అందించాం. సంబంధిత రూట్ల గురించి కూడా తెలియజేశాం’’ అని అరాగ్చీ తన పోస్టులో పేర్కొన్నారు. ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. హార్ముజ్‌ను తెరిచేందుకు ఇరాన్ అంగీకరించిందని తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
ఇరాన్ ఈ నిర్ణయానికి తీసుకోవడానికి లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందమే కారణం. దీనికి కూడా ట్రంప్ తనవంతు ప్రయత్నం చేశారు. అంతేకాదు.. ఇరు దేశాల అధ్యక్షుల్ని చర్చలు జరిపేందుకు ఒప్పిస్తానని ట్రంప్ అన్నారు. హార్ముజ్ జలసంధి అందుబాటులోకి వస్తే ప్రపంచంలోని అనేక దేశాల చమురు కష్టాలు తీరుతాయి. అంతేకాదు.. ఆహారం, ఎరువులు, ఔషధాలు వంటివి కూడా అందుబాటులోకి వస్తాయి. మరోవైపు ఇరాన్ చేసిన ఈ ప్రకటనతో అంతర్జాతీయంగా చమరు ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Ceasefire
- Donald Trump
- iran
- Israel
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

