12 మంది ఖైదీలను ఉరి తీసిన ఇరాన్
పారిస్: ఇరాన్లో 12 మంది ఖైదీలను ఒకే రోజు ఉరి తీశారు. ఇందులో 11 మంది పురుషులు, ఓ మహిళ ఉన్నారు. సిస్తాన్-బలుచిస్తాన్ ప్రావిన్సులో ఉన్న జహెదాన్ జైలులో సోమవారం ఉదయం వీళ్లను ఉరి తీశారు. ఈ ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ బోర్డర్ సమీపంలో ఉంది. డ్రగ్స్, మర్డర్ కేసులో వీళ్లంతా దోషులుగా ఉన్నారు. 12 మందిని ఉరి తీసిన విషయాన్ని నార్వేకు చెందిన ఇరాన్ హ్యూమన్ రైట్స్ తెలిపింది. ఉరి తీయబడినివారంతా బలూచి తెగకు చెందినట్లు ఆ సంస్థ చెప్పింది. ఇస్లాంలోని సున్నీ వర్గానికి చెందినవారు. 12 మందిలో ఆరుగురిపై డ్రగ్ ఆరోపణలు ఉండగా, మరో ఆరుగురిపై మర్డర్ ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇరాన్‌కు చెందిన స్థానిక మీడియా ఈ మరణశిక్షపై ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే ఇరాన్లో మైనార్టీ తెగలకు చెందినవారిని టార్గెట్ చేస్తున్నట్లు ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. 2021లో ఇరాన్లో 333 మంది ఉరి తీశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: దివ్యాంగుల కోచ్‌లోకి ఎక్కనీయకపోవడంతో.. రాళ్లు రువ్విన వ్యక్తులు, వీడియో వైరల్
KTR | కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్ర పోరాటాన్ని చూసిన మనం అదృష్టవంతులం : కేటీఆర్
TB | టీబీ వచ్చి తగ్గిన తరువాత శరీరంలో జరిగే మార్పులేమిటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
Stalin rejects Oppn pitch | డీలిమిటేషన్‌పై వెనక్కి తగ్గని స్టాలిన్.. ‘ఇండియా’ కూటమి నేతల చర్చలు విఫలం
Health tips | శుభ్రం చేసేటప్పుడు పచ్చి చేప కళ్లను తీసిపారేస్తున్నారా.. అయితే ఈ ప్రయోజనాలను కోల్పోతున్నట్లే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

