e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 20, 2022
Home News Eradication of Poverty : పేదరికం నిర్మూలన ఎప్పటికి సాధ్యమయ్యేను..?

Eradication of Poverty : పేదరికం నిర్మూలన ఎప్పటికి సాధ్యమయ్యేను..?

(Eradication of Poverty) ఇవాళ పేదరిక నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవం. పేదరికంలో జీవిస్తున్న ప్రజలు, వారిని బయటకు తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు, పోరాటాలను గుర్తించడానికి ఈ రోజును పేదరికం నిర్మూలన కోసం అంతర్జాతీయ దినంను చేపడుతుంటాం. ఫ్రెంచ్‌ మతాధికారి జోసెఫ్ వ్రెసిన్స్కీ పేదరికం బాధితుల పట్ల వివక్షకు తావు లేకుండా, వారిని గౌరవప్రదంగా చూడాలంటూ ఎన్నో పోరాటాలు చేశారు. అలాగే, 1987 అక్టోబర్ 17 న పేదరికం, ఆకలి, హింస బాధితులను గౌరవించడానికి పారిస్‌లోని ట్రోకాడోరో వద్ద సమావేశమైన ప్రతినిధులు పేదరికాన్ని మానవ హక్కుల ఉల్లంఘనగా ప్రకటించారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 1992 డిసెంబర్ 22 న తీర్మానాన్ని ఆమోదించి.. అక్టోబర్ 17 ను పేదరిక నిర్మూలన కోసం అంతర్జాతీయ దినంగా ప్రకటించింది. మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనపై కూడా 1948 లో ఇదే రోజున సంతకం చేశారు.

ఆధునిక టెక్నాలజీని అందింపుచ్చుకుంటున్నప్పటికీ.. పేదరికం నుంచి బయటపడలేకపోతున్నాం. దీనికి కారణాలు ఏవైనా ప్రపంచ దేశాల్లో ఇంకా కోట్లాది మంది పేదరికంలో మగ్గిపోతూ కడు దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని పథకాలు తెస్తున్నా.. అవి పేదవాడికి చేరకపోవడం విచారకరం. ఈ నేపథ్యంలో పేదరికం నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రపంచ దేశాలకు అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్య సమితి ఏటా ఇదే రోజున అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినంను నిర్వహిస్తున్నది.

కొవిడ్‌తో మళ్లీ పేదరికంలోకి..

- Advertisement -

ఐక్యరాజ్యసమితి ప్రచురించిన ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం, కొవిడ్ -19 మహమ్మారి సమయంలో దాదాపు 8.8 కోట్ల నుంచి 11.5 కోట్ల మంది ప్రజలు పేదరికం వైపు నెట్టివేయబడ్డారు. మహమ్మారికి ముందు పేదరికంలో నివసిస్తున్న వారు 1.3 కోట్ల మంది ఉండేవారు. పైగా ఈ సంవత్సరం పేదరికం ప్రపంచ దేశాల్లో 14.3 కోట్ల నుంచి 16.3 కోట్లకు పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. ‘ప్రస్తుతం ప్రపంచ దేశాలన్ని తీవ్ర పేదరికాన్ని ఎదుర్కొంటున్నాయి. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసి పెద్ద విధ్వంసం సృష్టించింది’ అంటూ ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ ఆవేదన వ్యక్తం చేశారు.

మరికొన్ని ముఖ్య సంఘటనలు..

2009: గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రమాదం గురించి ప్రపంచ దేశాలను హెచ్చరించేందుకు ప్రపంచంలో తొలిసారి నీటి అడుగున క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించిన మాల్దీవులు

2003: మనుషులను అంతరిక్షంలోకి పంపడం ద్వారా ఆసియాలో తొలి, ప్రపంచంలో మూడో దేశంగా అవతరించిన చైనా

1979 : మధర్‌ థెరెసాకు నోబెల్‌ బహుమతి ప్రదానం

1941: రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికన్ షిప్‌పై దాడి చేసిన జర్మన్ జలాంతర్గామి

1933: జర్మనీని వీడి అమెరికాకు వెళ్లిన ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

1917: మొదటి ప్రపంచ యుద్ధంలో తొలిసారిగా జర్మనీపై వైమానిక దాడులను ప్రారంభించిన బ్రిటన్

1912: ఒట్టోమన్ సామ్రాజ్యంపై యుద్ధం ప్రకటించిన బల్గేరియా, గ్రీస్ మరియు సెర్బియా

1888: ఆప్టికల్ ఫోనోగ్రాఫ్ కోసం పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న సైంటిస్ట్ థామస్ ఆల్వా ఎడిసన్

ఇవి కూడా చ‌ద‌వండి..

పండ్ల వ్యర్థాల నుంచి కొత్త రకం బ్యాండేజీ.. సింగపూర్‌ శాస్త్రవేత్తల సృష్టి

అన్నపూర్ణలకే ఆహార సమస్యలు.. రక్తహీనత సమస్యలు తొలిగేదెలా?

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement